Babar Azam : టీ20ల్లో చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం.. క్రిస్‌గేల్ ఆల్ టైం టీ20 రికార్డ్ బ్రేక్..
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాం అరుదైన ఘనత సాధించాడు

Babar Azam breaks Gayle all time T20 record
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాం అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 11 వేల పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బాబర్ ఈ రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ 20 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 31 పరుగులు చేశాడు. ఈ క్రమంలో క్రిస్‌గేల్ రికార్డును బ్రేక్ చేశాడు.
టీ20ల్లో గేల్ 314 ఇన్నింగ్స్‌ల్లో 11 వేల పరుగులు చేయగా బాబర్ ఆజాం కేవలం 298 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. వీరిద్దరి తరువాత డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీలు ఉన్నారు.
IND vs AUS : మూడో టెస్టు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టులో రెండు మార్పులు
టీ20ల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
బాబర్ ఆజాం – 298 ఇన్నింగ్స్‌ల్లో
క్రిస్‌గేల్ -314 ఇన్నింగ్స్‌ల్లో
డేవిడ్ వార్నర్ – 330 ఇన్నింగ్స్‌ల్లో
విరాట్ కోహ్లీ – 337 ఇన్నింగ్స్‌ల్లో
ఆరోన్ ఫించ్ – 363 ఇన్నింగ్స్‌ల్లో
జోస్ బట్లర్ – 376 ఇన్నింగ్స్‌ల్లో
జేమ్స్ విన్సీ- 386 ఇన్నింగ్స్‌ల్లో
అలెక్స్ హేల్స్ – 390 ఇన్నింగ్స్‌ల్లో
రోహిత్ శర్మ – 408 ఇన్నింగ్స్‌ల్లో
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్ (98 నాటౌట్ 57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరల్లో ఇర్ఫాన్ ఖాన్ (30 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. అనంతరం లక్ష్యాన్ని దక్షిణాప్రికా 19.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సఫారీ బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్ (117 63 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (66 నాటౌట్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
బాబర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 14000 పరుగులు పూర్తి చేశాడు మరియు లెజెండరీ మహ్మద్ యూసుఫ్ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండవ అత్యంత వేగంగా పాకిస్థానీగా నిలిచాడు.