IND vs AUS : మూడో టెస్టు.. టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్.. తుది జట్టులో రెండు మార్పులు

బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ శనివారం ఉదయం బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ

IND vs AUS : మూడో టెస్టు.. టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్.. తుది జట్టులో రెండు మార్పులు

Teamindia

Updated On : December 14, 2024 / 8:06 AM IST

India vs Australia 3rd Test : బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ శనివారం ఉదయం బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, తుది జట్టులో టీమిండియా రెండు మార్పులు చేసింది. హర్షిత్ రాణా, రవిచంద్రన్ అశ్విన్ ను పక్కన పెట్టిన రోహిత్ శర్మ.. వారి స్థానంలో ఆకాష్ దీప్, రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకున్నారు.

 

క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, మెక్ స్వీని వికెట్ పడకుండా ఆచితతూచి ఆడుతున్నారు. అయితే, 19 పరుగుల వద్ద వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ కట్టుదిట్టమైన బంతులతో బౌలింగ్ చేస్తుండగా.. ఆసీస్ బ్యాటర్లు వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు.

 

ఇండియా తుది జట్టు : యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ర్పీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
ఆస్ట్రేలియా తుది జట్టు : ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్ స్వీని, లుబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ గ్యారీ, కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, హేజిల్ వుడ్.