Gukesh : గుకేశ్ గెలవలేదు.. చైనీస్ ఆటగాడు కావాలనే ఓడిపోయాడు.. రష్యా చెస్ ఫెడరేషన్ సంచలన ఆరోపణలు..
రష్యా చెస్ ఫెడరేషన్ మాత్రం సంచలన ఆరోపణలు చేసింది.

Russian chess federation head accuses Ding of losing on purpose against Gukesh in World Championship
భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చెస్ చాంపియన్ గా ఆవిర్భవించాడు. సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో చైనా దిగ్గజం డింగ్ లిరెన్ ను ఓడించి విశ్వవిజేతగా నిలిచాడు. 18 ఏళ్లకే ఈ ఘనత సాధించి.. అతి పిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు గుకేశ్. హోరాహోరీగా సాగిన 14వ రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ ను చిత్తు చేశాడు. 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు.
ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా అతడిపై ప్రశంసల వర్షం కురిస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులు గుకేశ్ ని అభినందిస్తున్నారు. అయితే.. రష్యా చెస్ ఫెడరేషన్ మాత్రం సంచలన ఆరోపణలు చేసింది. గుకేశ్ తన ప్రతిభతో గెలవలేదని, లిరెన్ కావాలనే ఓడిపోయాడని వ్యాఖ్యానించింది.
IND vs AUS : వామ్మో.. మూడో టెస్టుకు ఒక్క రోజు ముందే తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..
గుకేశ్ విజేత నిలిచిన తరువాత రష్యా చెస్ ఫెడరేషన్ చీఫ్ ఆండ్రీ ఫిలాటోవ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ ఫలితం చెస్ అభిమానులు, నిపుణులను ఆశ్చర్యపరిచిందన్నారు. హోరాహోరీగా పోరు సాగినప్పటికి చైనా ఆటగాడి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు.
మ్యాచ్‌లో లీరెన్ ఉన్న స్థితిలో అతడు ఓడిపోవడం అసంభవం అని చెప్పాడు. అతడు కావాలనే తప్పులు చేసినట్లుగా కనిపిస్తుందన్నాడు. దీనిపై అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఫిడే) విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు.
Paddy Upton: నాడు ధోనీ వెనుక.. నేడు గుకేశ్ విజయబాటలో.. ‘ప్యాడీ అప్టన్’ కీలక పాత్ర..
కాగా.. 14వ రౌండ్ నాలుగు గంటల పాటు సాగింది. మొత్తం 58 ఎత్తుల్లో మ్యాచ్ పూర్తి అయింది. అయితే.. 55వ ఎత్తులో లిరెన్ ఓ తప్పిదాన్ని చేశాడు. ఏనుగు కదిపాడు. ఇది గుకేశ్‌కు కలిసి వచ్చింది. వెంటనే ఆ ఏనుగును తన ఏనుగుతో గుకేశ్ చంపేశాడు. ఆ తరువాత మ్యాచ్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టలేదు.