IND vs AUS : వామ్మో.. మూడో టెస్టుకు ఒక్క రోజు ముందే తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..
మూడో టెస్టుకు ఒక్క రోజు ముందే ఆస్ట్రేలియా తుది జట్టును ప్రకటించింది.

Pat Cummins reveals Australia playing XI for Gabba Test
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా, భారత జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. తొలి టెస్టులో భారత్, రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయాలను సాధించాయి. ఈ క్రమంలో కీలకమైన మూడో టెస్టుకు ఇరు జట్లు సన్నద్ధం అయ్యాయి. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా శనివారం (డిసెంబర్ 14) నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత కాలమానం ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు ఒక్క రోజు ముందే ఆస్ట్రేలియా తుది జట్టును ప్రకటించింది. కేవలం ఒక్క మార్పుతోనే బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ కమిన్స్ చెప్పాడు.
Paddy Upton: నాడు ధోనీ వెనుక.. నేడు గుకేశ్ విజయబాటలో.. ‘ప్యాడీ అప్టన్’ కీలక పాత్ర..
గాయంతో రెండో టెస్టుకు దూరం అయిన జోష్ హాజిల్‌వుడ్ తిరిగి జట్టుతో చేరనున్నాడు. పింక్ బాల్ టెస్టులో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించిన స్కాట్ బొలాండ్ బెంచీకే పరిమితం కానున్నాడు. ఈ ఒక్క మార్పు మినహా అడిలైడ్‌లో ఆడిన జట్టుతోనే ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది.
61 మ్యాచులు ఆడితే..
క్రిస్మస్‌కు ముందు గబ్బా మైదానంలో ఆడిన మ్యాచుల్లో ఆసీస్‌కు ఘనమైన రికార్డు ఉంది. క్రిస్మస్ కు ముందు గబ్బాలో ఆస్ట్రేలియా 61 టెస్టులు ఆడింది. కేవలం ఏడు మ్యాచుల్లోనే ఓడిపోయింది. అదే.. క్రిస్మస్ తరువాత ఐదు టెస్టులు ఆడగా మూడింటిలో ఓడిపోయింది.
Dommaraju Gukesh: ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్.. ప్రైజ్‌మనీ ఎంత గెలుచుకున్నాడో తెలుసా?
ఆస్ట్రేలియా తుది జట్టు : ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనె, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లైయన్, జోస్ హేజిల్‌వుడ్.
JUST IN: Josh Hazlewood is back for the Gabba Test! #AUSvIND pic.twitter.com/ikV3L6JAU6
— cricket.com.au (@cricketcomau) December 13, 2024