Paddy Upton: నాడు ధోనీ వెనుక.. నేడు గుకేశ్ విజయబాటలో.. ‘ప్యాడీ అప్టన్’ కీలక పాత్ర..

ప్యాడీ ఆప్టన్ గతంలో టీమిండియా వరల్డ్ కప్ విజయంలో, భారత్ హాకీ జట్ల విజయాల్లోనూ కీలక భూమిక పోషించాడు. తాజా.. గుకేశ్ ప్రపంచ చాంపియన్ గా నిలవడంలోనూ..

Paddy Upton: నాడు ధోనీ వెనుక.. నేడు గుకేశ్ విజయబాటలో.. ‘ప్యాడీ అప్టన్’ కీలక పాత్ర..

Paddy Upton

Updated On : December 13, 2024 / 9:15 AM IST

Paddy Upton: భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చెస్ చాంపియన్ గా ఆవిర్భవించాడు. సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో 18ఏళ్ల వయసులోనే విశ్వవిజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. క్లాసికల్ ఫార్మాట్ లో డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ తో జరిగిన 14గేమ్ ల పోరులో గుకేశ్ 7.5-6.5 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. క్లాసికల్ చెస్ లో ప్రపంచ చాంపియన్ గా నిలిచిన చిన్న వయస్కుడిగా ఇప్పటి వరకు రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ పేరిట 39ఏళ్లుగా ఉన్న రికార్డును గుకేశ్ బద్దలు కొట్టాడు. అయితే, గుకేశ్ విజయం తరువాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ప్యాడీ ఆప్టన్. అతను గుకేశ్ కు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ గా ఉన్నాడు. గుకేశ్ విజయబావుటా ఎగురవేయడంలో ప్యాడీ ఆప్టన్ కీలక భూమిక పోషించారనే చెప్పొచ్చు.

Also Read: Dommaraju Gukesh: ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్.. ప్రైజ్‌మ‌నీ ఎంత గెలుచుకున్నాడో తెలుసా?

ప్యాడీ ఆప్టన్ గతంలో టీమిండియా వరల్డ్ కప్ విజయంలో, భారత్ హాకీ జట్ల విజయాల్లోనూ కీలక భూమిక పోషించాడు. 2011లో ప్రపంచ కప్ లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్యాడీ ఆప్టన్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ గా పనిచేశారు. పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం ముద్దాడిన పురుషుల హాకీ జట్టు కోసం గతంలో ఆప్టన్ పనిచేశాడు. తాజాగా.. వరల్డ్ ఛాంపియన్ విజేతగా నిలిచిన గుకేశ్ మానసికంగా బలంగా ఉండటంకోసం స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ గా ప్యాడీ ఆప్టన్ పనిచేశాడు. ఆప్టన్ సూచనలతో గేమ్ లో సమయాన్ని ఎలా గడపాలి.. నిద్రను ఎలా సమన్వయం చేసుకోవాలి.. ఖాళీ సమయంలో ఏం చేయాలి.. ఇలా ప్రతీ విషయాన్ని గుకేశ్ పక్కాగా రూపొందించుకున్నాడు. తద్వారా ప్రపంచ విజేతగా నిలిచాడు.

Also Read: IND vs AUS 3rd Test : గ‌బ్బా టెస్టులో బుమ్రా ఆడ‌తాడా? ఆడ‌డా?

ప్యాడీ ఆప్టన్ సహకారం గురించి గుకేశ్ ప్రస్తావిస్తూ.. నేను మే-జూన్ నుండి ఆప్టన్ తో కలిసి పనిచేయడం ప్రారంభించాను. ఎందుకంటే, ప్రపంచ ఛాంపియన్ కావాలంటే మానసికంగా దృఢంగా ఉండాలని నాకు తెలుసు. ప్రారంభంలో నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను ఆ సమస్యలపై ఆప్టన్ తో చర్చించాను. అతనికి చెస్ తెలియదు. అయితే, ఇంత పెద్ద సవాలును ఎలా ఎదుర్కోవాలో అతనికి తెలుసు. మేము చాలా సరదాగా గడిపాము. 2011లో భారత్ క్రికెట్ ప్రపంచ కప్ గెలవడానికి ఆప్టన్ సహాయం చేశాడు. ఈసారి అతను నన్ను కూడా ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఈ క్రమంలో మెంటల్ కండిషనింగ్ కోచ్ ని కలిగి ఉండాలని చెస్ ఆటగాళ్లందరికీ గుకేశ్ సలహా ఇచ్చాడు.
ఆప్టన్ గురించి గుకేశ్ మరోవిషయాన్ని చెప్పాడు.. ‘‘ నేను సరిగ్గా నిద్రపోలేదు. 12వ గేమ్ తరువాత విశ్రాంతి రోజున ఆప్టన్ తో మాట్లాడాను. అతను నాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. అవి ఉపయోగపడతాయి. రాబోయే రెండు మ్యాచ్ లలో మానసికంగా నేను చాలా ఫ్రెష్ గా ఉన్నాను’ అని పేర్కొన్నాడు.