IND vs AUS 3rd Test : గబ్బా టెస్టులో బుమ్రా ఆడతాడా? ఆడడా?
బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికగా డిసెంబర్ 14 నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Biggest update on Jasprit Bumrah availability for Gabba Test
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది. తొలి టెస్టులో భారత్ గెలవగా, రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో కీలకమైన మూడో టెస్టు మ్యాచులో ఎవరు విజయం సాధిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికగా డిసెంబర్ 14 నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. సాధారణంగా పేస్‌కు అనుకూలం అయిన ఈ పిచ్‌పై బ్యాటర్లు ఎలా ఆడతారు అన్న దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
కాగా.. టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండో టెస్టు మ్యాచులో కాస్త అసౌకర్యానికి గురైయ్యాడు. అతడి కండరాలు పట్టేసినట్లుగా తెలుస్తోంది. దీంతో తక్కువ వేగంతో బౌలింగ్ చేశాడని, మూడో టెస్టులో అతడు ఆడడం అనుమానమేనన్న వార్తలు వచ్చాయి. ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ డామియన్ ఫ్లెమింగ్ సైతం సంచలన ఆరోపణలు చేశాడు. బుమ్రా గాయాన్ని టీమ్‌మేనేజ్‌మెంట్ దాచి పెడుతుందన్నారు.
ఈ ఆరోపణలకు తోడు మంగవారం ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా పాల్గొనలేదు. దీంతో భారత అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు దీనిపై కాస్త స్పష్టత వచ్చింది. గురువారం ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా పాల్గొన్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో అతడు బౌలింగ్ చేసినట్లుగా జర్నలిస్ట్ భరత్ సుందరేశన్ తెలిపారు. అతడి బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ లు ప్రాక్టీస్ చేసినట్లుగా వివరించారు.
కాగా.. బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మూడో టెస్టు కోసం బుమ్రా సిద్ధంగా ఉండడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేస్ కు అనుకూలించే గబ్బా మైదానంలో బుమ్రా ఎంత ప్రమాదకారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ICC Player of the Month : బుమ్రాకు షాకిచ్చిన పాకిస్థాన్ స్టార్ పేసర్..
Jasprit Bumrah started off with a couple of leg-breaks alongside R Ashwin but he’s now running in hot & bowling at full tilt, being an absolute handful to KL Rahul & Yashasvi Jaiswal #AusvInd pic.twitter.com/3IRzE0QXbm
— Bharat Sundaresan (@beastieboy07) December 12, 2024