Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ వివాదంలో కొత్త ట్విస్ట్.. టీ20 ఫార్మాట్లో నిర్వహించే అవకాశం.. ఎందుకంటే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ -2025కు పాకిస్థాన్ ఆతిధ్యమిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి టోర్నీ ప్రారంభం కావాల్సి ఉండగా..

Champions Trophy 2025
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారా.. అందుకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ -2025కు పాకిస్థాన్ ఆతిధ్యమిస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి టోర్నీ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇంకా అధికారికంగా షెడ్యూల్ మాత్రం విడుదల కాలేదు. టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదించింది. అందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఓకే చెప్పినప్పటికీ.. హైబ్రిడ్ పద్దతిలో టోర్నీ జరగాలంటే తమ డిమాండ్లకు ఐసీసీ ఒప్పుకోవాలని పేర్కొంటుంది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటన ఆలస్యమవుతోంది.
Also Read: IND vs AUS 3rd Test: ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు అంతరాయం తప్పదా.. ఎందుకంటే?
ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం.. టోర్నమెంట్ షెడ్యూల్ ను 100 రోజుల ముందుగానే ప్రకటించాలి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్ 12నే షెడ్యూల్ ను ప్రకటించాల్సి ఉంది. కానీ, హైబ్రిడ్ మోడల్ లో టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేసింది. పాకిస్థాన్ టోర్నీకి ఆధిత్యమిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లి ఆడే పరిస్థితి లేదని భారత్ కుండబద్దలు కొట్టేసింది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ పద్దతిలో నిర్వహించేందుకు పీసీబీ ఓకే చెప్పినప్పటికీ.. భారత్ వేదికగా జరిగే ఈవెంట్లలో అదే హైబ్రిడ్ ఫార్మాట్ ను మాకు వర్తింపజేయాలని పట్టుబడుతుంది. బీసీసీఐ అందుకు వ్యతిరేకిస్తుంది. దీనికితోడు పీసీబీ మరికొన్ని డిమాండ్లపై ఐసీసీ స్పందించలేదు.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే, ట్రోఫీ నిర్వహణకు కేవలం 75రోజులు మాత్రమే గడువు ఉంది. త్వరలో పరిష్కారం దొరకకపోతే మార్కెటింగ్ కు ఇబ్బందులు ఎదురవుతాయని ప్రసారకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టోర్నీని టీ20 ఫార్మాట్ లో నిర్వహించాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. రాబోయే వారం రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల కాకపోతే వన్డే ఫార్మాట్ ను కాస్తా టీ20 ఫార్మాట్ లోకి మారే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. ఈ క్రమంలో టోర్నీని ఏ ఫార్మాట్ లో నిర్వహిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.