IND vs AUS 3rd Test: ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు అంతరాయం తప్పదా.. ఎందుకంటే?

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. గర్బాలో భారత కాలమానం ప్రకారం ..

IND vs AUS 3rd Test: ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు అంతరాయం తప్పదా.. ఎందుకంటే?

Brisbane Test weather update

Updated On : December 12, 2024 / 7:53 AM IST

Gabba Test: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ శనివారం నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా, ఇండియా చెరో మ్యాచ్ లో విజయంతో 1-1తో సమఉజ్జీలుగా ఉన్నాయి. అయితే, బిస్బేన్ లోని గర్బా మైదానంలో జరిగే మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారనుంది. ట్రోఫీలో పైచేయి సాధించడానికే కాకుండా.. వచ్చే ఏడాది జరిగే ఐసీసీ వరల్డ్ ఛాంపియన్స్ టెస్టు ఫైనల్ మ్యాచ్ కు అర్హత సాధించాలంటే ఈ టెస్టులో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

Also Read: ICC Player of the Month : బుమ్రాకు షాకిచ్చిన పాకిస్థాన్ స్టార్ పేస‌ర్‌..

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. గర్బాలో భారత కాలమానం ప్రకారం ఉదయం 5.50 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే, ఈ టెస్టు జరిగే ఐదు రోజులు మేఘావృతం అయి ఉంటుందని ఆస్ట్రేలియా గవర్నమెంట్ బ్యూరో ఆఫ్ మెటీరియాలజీ తెలిపింది. మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం కురిసే అవకాశం ఉందట. ఐదు రోజులు పాటు 40శాతం వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. దీనికితోడు వేగంగా గాలులు వీచే అవకాశంకూడా ఉంది. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో మూడో టెస్టు మ్యాచ్ జరగడం కష్టమని తెలుస్తోంది.

Also Read: IND vs AUS : బ్రిస్బేన్‌లో అడుగుపెట్టిన రోహిత్ సేన‌.. మ‌రోసారి చ‌రిత్ర పున‌రావృత‌మ‌య్యేనా?

మరోవైపు గబ్బాలో జరిగిన 61 టెస్టుల్లో ఆస్ట్రేలియా ఏడు సార్లు మాత్రమే పరాజయం పాలైంది. ఇక్కడ ఏడు టెస్టులు ఆడిన భారత్ జట్టు ఒకేఒక్కసారి (2021లో) విజయం సాధించింది. రిషబ్ పంత్ సూపర్ ఇన్నింగ్స్ తో భారత్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. 1988 తరువాత గబ్బాలో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు అదే తొలిసారి కావటం గమనార్హం. గబ్బా పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది. ఈ క్రమంలో వర్షం ముప్పు పొంచిఉన్నన్పటికీ రెండు జట్లూ తమ ఫైనల్ టీంలో వీలైనంత మంది ఫాస్ట్ బౌలర్లను బరిలోకి దింపేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫాస్ట్ బౌలర్లు వాతావరణం మేఘావృతమైన పరిస్థితుల్లో మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది.