ICC Player of the Month : బుమ్రాకు షాకిచ్చిన పాకిస్థాన్ స్టార్ పేసర్..
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటించింది.

Haris Rauf beats Jasprit Bumrah to win ICC Player of the Month award for November 2024
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటించింది. నవంబర్ నెలకు గాను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును పాకిస్థాన్ స్టార్ పేసర్ హారిస్ రౌఫ్ గెలుచుకున్నాడు. అతడు టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జెన్సెన్‌లను ఓడించి మరీ ఈ అవార్డును గెలుచుకున్నాడు.
హారిస్ రౌఫ్ నవంబర్ నెలలో బంతితో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా గడ్డ పై పాకిస్థాన్ జట్టు వన్డే సిరీస్ గెలవడంలో హారిస్ ప్రధాన పాత్ర పోషించాడు. తొలి వన్డే మ్యాచులో మూడు వికెట్లు, రెండో వన్డేలో ఐదు వికెట్లతో సత్తాచాటాడు. మూడో వన్డేలో రెండు వికెట్లు పడగొట్టాడు.
IND vs AUS : బ్రిస్బేన్‌లో అడుగుపెట్టిన రోహిత్ సేన.. మరోసారి చరిత్ర పునరావృతమయ్యేనా?
టీ20ల్లోనూ అతడు సత్తా చాటాడు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు వికెట్లు సాధించాడు. మొత్తంగా హారిస్ గత నెలలో వైట్ బాల్ క్రికెట్‌లో 18 వికెట్లు తీసి అవార్డును కైవసం చేసుకున్నాడు.
నవంబర్ నెలలో ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఇంగ్లాండ్ ప్లేయర్ డాని వ్యాట్ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించింది. మూడు మ్యాచుల్లో 71 సగటుతో 163.21 స్ట్రైక్‌రేటుతో 142 పరుగులు చేసింది.
IND vs AUS : ఇదేం పిచ్చిరా అయ్యా.. ఇంకా 15 రోజులు ఉండగానే.. ఫస్ట్ డే టికెట్లు సోల్డ్..
ఈ అవార్డును గెలుచుకోవడం పై డాని వ్యాట్ స్పందించింది. ‘ఈ అవార్డును సొంతం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. దీన్ని గౌరవంగా భావిస్తున్నాను. ప్రతి రోజు నన్ను ప్రొత్సహిస్తున్న సహచరులు, కోచ్‌లు అందరికి ధన్యవాదాలు. ‘అని అంది.