IND vs AUS : ఇదేం పిచ్చిరా అయ్యా.. ఇంకా 15 రోజులు ఉండ‌గానే.. ఫ‌స్ట్ డే టికెట్లు సోల్డ్‌..

బాక్సింగ్ డే టెస్టు కి ఇంకా 15 రోజుల స‌మ‌యం ఉంది.

IND vs AUS : ఇదేం పిచ్చిరా అయ్యా.. ఇంకా 15 రోజులు ఉండ‌గానే.. ఫ‌స్ట్ డే టికెట్లు సోల్డ్‌..

Boxing Day Test tickets sold out for Day 1 in Melbourne

Updated On : December 10, 2024 / 2:55 PM IST

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ సిరీస్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు నువ్వా నేనా అన్న‌ట్లుగా పోటీప‌డుతున్నాయి. తొలి టెస్టులో భార‌త్ విజ‌యం సాధించ‌గా రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలుపొందింది. దీంతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ప్ర‌స్తుతానికి 1-1తో స‌మంగా ఉంది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైన‌ల్‌కు చేరుకోవాలంటే ఇరు జ‌ట్ల‌కు ఈ సిరీస్ ఎంతో కీల‌కం.

ఈ నేప‌థ్యంలో మిగిలిన మూడు టెస్టులో విజ‌యం సాధించేందుకు భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతాయ‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. బ్రిస్బేన్ వేదిక‌గా డిసెంబ‌ర్ 14 నుంచి మూడో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా, డిసెంబ‌ర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదిక‌గా నాలుగో టెస్టు ఆరంభం కానుంది.

IND vs AUS : మూడో టెస్టుకు ముందు భార‌త్‌కు ఊహించ‌ని షాక్‌.. గాయ‌ప‌డిన రిష‌బ్ పంత్..!

కాగా.. బాక్సింగ్ డే టెస్టు (నాలుగో టెస్టు)కి ఇంకా 15 రోజుల స‌మ‌యం ఉంది. అయిన‌ప్ప‌టికి ఈ మ్యాచ్‌కు సంబంధించిన తొలి రోజు టికెట్లు అన్ని అమ్ముడు పోయాయి. ప‌బ్లిక్ సేల్ ప్రారంభించిన కొద్ది స‌మ‌యంలోనే మ్యాచ్ తొలి రోజు టికెట్లు అమ్ముడు పోయిన‌ట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపింది. ఈ స్టేడియం కెపాసిటీ 90 వేలు.

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ తొలి రోజు టికెట్లు అందుబాటులో లేక‌పోయిన‌ప్ప‌టికి మిగిలిన రోజుల టికెట్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు అని సీఏ తెలిపింది.

IND vs AUS : రెండో టెస్టులో భార‌త్ పై విజ‌యం.. 24 గంట‌ల్లోనే ఆస్ట్రేలియా ఆనందం ఆవిరి.. కొంప‌ముంచిన ద‌క్షిణాఫ్రికా..

ఇదిలా ఉంటే.. పింక్ బాల్ టెస్టుకు కూడా ఫ్యాన్స్ పెద్ద సంఖ్య‌లో వ‌చ్చారు. మూడు రోజుల్లో 1,35,012 మంది ప్రేక్ష‌కులు హాజ‌రు అయ్యారు. మొద‌టి రోజు 50,186 మంది, రెండో రోజు 51,542 మంది ప్రేక్ష‌కులు మ్యాచ్ చూసేందుకు వ‌చ్చారు.