AUS-W vs IND-W : ఆసీస్ పర్యటనలో భారత్‌కు ఘోర పరాభవం.. స్మృతి మంధాన శతకం వృథా.. మూడో వన్డేలోనూ టీమ్ఇండియాకు తప్పని ఓటమి..
ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళా జట్టుకు ఏదీ కలిసి రాలేదు.

Australia Women won by 83 runs in 3rd ODI against India Women
ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళా జట్టుకు ఏదీ కలిసి రాలేదు. వరుసగా మూడో వన్డే మ్యాచులోనూ ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 45.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్ 83 పరుగులు తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (105; 109 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగింది. హార్లీన్ డియోల్ (39) ఫర్వాలేదనిపించింది. మిగిలిన వారిలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (12), జెమిమా రోడ్రిగ్స్ (16) లు రెండు అంకెల స్కోరు చేశారు.
ICC Player of the Month : బుమ్రాకు షాకిచ్చిన పాకిస్థాన్ స్టార్ పేసర్..
మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లీన్ గార్డ్‌నర్ ఐదు వికెట్లు తీసింది. అలానా కింగ్, మెగాన్ షట్ చెరో రెండు వికెట్లు తీశారు. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ ఓ వికెట్ సాధించింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో అన్నాబెల్ సదర్లాండ్ (110; 95 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో చెలరేగింది. ఆష్లే గార్డ్‌నర్ (50), తహిళ మెక్‌గ్రాత్ (56 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి నాలుగు వికెట్లు తీసింది. దీప్తి శర్మ ఓ వికెట్ సాధించింది.
IND vs AUS : బ్రిస్బేన్‌లో అడుగుపెట్టిన రోహిత్ సేన.. మరోసారి చరిత్ర పునరావృతమయ్యేనా?