IND vs AUS 3rd Test : రోహిత్ శ‌ర్మ నిర్ణ‌యం పై బుమ్రా అసంతృప్తి.. స్టంప్ మైక్‌లో మాట‌లు రికార్డు..

టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రో ఆలోచ‌న లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు.

IND vs AUS 3rd Test : రోహిత్ శ‌ర్మ నిర్ణ‌యం పై బుమ్రా అసంతృప్తి.. స్టంప్ మైక్‌లో మాట‌లు రికార్డు..

Bumrah blasts Rohit bowl first decision in Brisbane test

Updated On : December 14, 2024 / 11:03 AM IST

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య బ్రిస్బేన్ వేదిక‌గా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రో ఆలోచ‌న లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా మొద‌ట బ్యాటింగ్‌కు దిగింది. ప్లేయ‌ర్ల మెరుపులు చూద్దామ‌నుకుంటే వ‌రుణుడు ఆటంకం క‌లిగిస్తున్నాడు. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ఆగిపోయింది.

వ‌రుణుడు ఆటంకం క‌లిగించే స‌మ‌యానికి 13.2 ఓవ‌ర్ల ఆటే సాధ్య‌మైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 28 ప‌రుగులు చేసింది. నాథన్ మెక్‌స్వీనీ (4), ఉస్మాన్ ఖావాజా (19) లు క్రీజులో ఉన్నారు.

Babar Azam : టీ20ల్లో చ‌రిత్ర సృష్టించిన బాబ‌ర్ ఆజాం.. క్రిస్‌గేల్‌ ఆల్ టైం టీ20 రికార్డ్ బ్రేక్‌..

కాగా.. పిచ్ పేసర్ల‌కు అనుకూలిస్తుంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే పిచ్ నుంచి బౌల‌ర్ల‌కు ఆశించినంత స‌హ‌కారం ల‌భించ‌డం లేదు. బంతి స్వింగ్ అవుతుంద‌ని భావించిన‌ప్ప‌టికి అలా జ‌ర‌గ‌డం లేదు. దీంతో బుమ్రా కాస్త అస‌హ‌నానికి లోనైయ్యాడు.

ఆసీస్ ఇన్నింగ్స్ ఐదో ఓవ‌ర్‌ను బుమ్రా వేశాడు. ఈ ఓవ‌ర్‌లో బంతిని స్వింగ్ చేయ‌డంతో బుమ్రా విఫ‌లం అయ్యాడు. దీంతో బుమ్రా అసంతృప్తికి లోనైయ్యాడు. ఎక్క‌డ బౌలింగ్ చేసినా బంతి స్వింగ్ కావ‌డం లేద‌ని గిల్‌తో అన్నాడు. అత‌డు అన్న మాట‌లు స్టంప్ మైక్ లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Mohammed Shami : టీ20ల్లో మ‌హ్మ‌ద్ ష‌మీ డ‌బుల్ సెంచ‌రీ.. ఆస్ట్రేలియాకు పంపండ‌య్యా..