IND vs AUS
India vs Australia 3rd Test Match: భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు అందరూ విఫలమవుతున్న వేళ పుజారా మాత్రం క్రీజులో నిలదొక్కుకుని అర్ధ సెంచరీ బాదాడు. మిగతా ఆటగాళ్లు ఎవరూ రాణించలేకపోవడంతో టీమిండియా అతి తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది.
రెండో ఇన్నింగ్స్ లోనూ టీమిండియా ఆటతీరు మార్చుకోకుండా 163 పరుగులకే ఆలౌటై అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 109 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 197 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 76 పరుగులు చేస్తే మూడో టెస్టులో విజయం సాధిస్తుంది.
భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. పుజారా 59 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం ఉమేశ్ యాదవ్ క్రీజులోకి వచ్చి డకౌట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్ 7 పరుగులతో ఉన్నాడు. క్రీజులోకి షమీ వచ్చాడు. టీమిండియా స్కోరు 155/9 (57 ఓవర్లకు)గా ఉంది.
భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజులో పుజారాకు చక్కటి సహకారం అందించిన రవిచంద్రన్ అశ్విన్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా 52, అక్షర్ పటేల్ 3 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 144/7 (51 ఓవర్లు)గా ఉంది.
పుజారా అర్ధ సెంచరీ బాదాడు. టీమిండియాలో మిగతా బ్యాటర్లందరూ విఫలమవుతున్న వేళ పుజారా క్రీజులో నిలదొక్కుకుని 108 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో పుజారాతో పాటు రవిచంద్రన్ అశ్విన్ (10) ఉన్నాడు. టీమిండియా స్కోరు 133-6 (46 ఓవర్లు)గా ఉంది.
టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో వరుసగా వికెట్లు కోల్పోతుంది. 118 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. లైయన్ వేసిన ఓవర్లో శ్రీకర్ భరత్ (3) ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా (46), రవీంద్ర అశ్విన్ (0) ఉన్నారు.
టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో ఐదో వికెట్ కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ (26) ఔట్ అయ్యాడు. దూకుడుగా ఆడిన శ్రేయాస్ 27 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ప్రస్తుతం పుజారా (45), శ్రీకర్ భరత్ (1) క్రీజులో ఉన్నారు. 38 ఓవర్లు పూర్తికాగా టీమిండియా స్కోర్ 115/5.
ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 100 పరుగుల మార్క్‌ను దాటింది. 35 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇండియా స్కోర్ 101/4. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ (15), ఛతేశ్వర్ పుజార (43) ఉన్నారు. పుజారా దాటిగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు.
https://twitter.com/ICC/status/1631214817863249923?cxt=HHwWhsC9sf_OnqMtAAAA
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నాల్గో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా (7) నాథన్ లైయన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 79/4. క్రీజులో పుజారా (36), శ్రేయాస్ అయ్యర్ (0) ఉన్నారు.
టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ (13) ఔట్ అయ్యాడు. కున్‌మన్ వేసిన బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 54 పరుగుల వద్ద టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో పుజారా, జడేజా ఉన్నారు.
రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (12) నాథన్ లైయన్ వేసిన 14.4 ఓవర్లో ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం క్రీజ్‌లో ఛతేశ్వర్ పుజారా (15), విరాట్ కోహ్లీ (1) ఉన్నారు.
రెండోఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 11 ఓవర్లు పూర్తయ్యే సరికి 24/1 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (11), పుజారా (4) పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (5) నాథన్ లైయన్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ, ఛతేశ్వర పుజరా క్రీజులో ఉన్నారు.
టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. శుభ్‌మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చారు.
https://twitter.com/BCCI/status/1631169859802513408?cxt=HHwWgIDS3YuWiqMtAAAA
https://twitter.com/BCCI/status/1631168982890983424?cxt=HHwWgMDRnYbjiaMtAAAA
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్, స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ బౌలింగ్ దాటికి ఆసీస్ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. క్రీజ్‌లో కుదురుకునేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో 197 పరుగులకే ఆసీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 88 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీసుకొని ఆసీస్ బ్యాటర్లను వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టించారు.
ఆస్ట్రేలిలో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశ్విన్ వేసిన 75 ఓవర్లో అలెక్స్ కేరీ (3) ఎల్బీడబ్ల్యూగా పెవిలిన్ బాటపట్టాడు.
https://twitter.com/BCCI/status/1631164858262773760?cxt=HHwWgIDTrfvyh6MtAAAA
ఆసీస్ మూడు ఓవర్ల వ్యవధిలోనే వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. మిచెల్ స్టార్క్ (1)ని ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 192 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్లు కోల్పోయింది. ఇది ఉమేశ్ యాదవ్ భారత్‌లో 100వ వికెట్ కావడం విశేషం.
https://twitter.com/BCCI/status/1631164008748421121?cxt=HHwWgsDQ_cHBh6MtAAAA
ఆస్ట్రేలియా హ్యాండ్స్ కాంబ్ ఔట్ తరువాత వెంటనే మరో వికెట్ కోల్పోయింది. కామెరూన్ గ్రీన్ (21) పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన 71.6 ఓవర్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు.
https://twitter.com/BCCI/status/1631161830847692801?cxt=HHwWgoDSrd_ChqMtAAAA
ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. హ్యాండ్స్‌కాంబ్ (19) అశ్విన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. హాండ్స్‌కాంబ్ శ్రేయస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 71 ఓవర్లకు స్కోరు 186/5.
https://twitter.com/BCCI/status/1631161013436563456?cxt=HHwWgIDSlZWThqMtAAAA
ఆసీస్, ఇండియా జట్ల మధ్య మూడో టెస్టులో భాగంగా రెండో రోజు మ్యాచ్ ప్రారంభమైంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజుద్దీన్ బౌలింగ్ వేయగా.. పరుగులేమీ రాలేదు. ప్రస్తుతం ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ కంటే 47 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్‌లో హ్యాండ్స్‌కాంబ్ (7), గ్రీన్ (6) పరుగులతో ఉన్నారు.
https://twitter.com/BCCI/status/1630891659201331202?cxt=HHwWhIC-3dfUi6ItAAAA
https://twitter.com/BCCI/status/1631142420401496064?cxt=HHwWgIDRofTY_aItAAAA
ఆసీస్, ఇండియా మూడో టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు బ్యాటింగ్ ఎంచుకొని మైదానంలోకి దిగిన భారత్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆసీస్ బౌలర్ల దాటికి ఏ ఒక్క టీమిండియా బ్యాటర్ 25 వ్యక్తిగత పరుగులకు చేరుకోలేదు. దీంతో 109కే టీమిండియా చేతులెత్తేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్.. భారత్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టింది. ఫలితంగా 156/4 పరుగులు చేసింది. అయితే, రెండోరోజు ఆటలోనూ తమ హవాను కొనసాగించేలా ఆసీస్ ప్రయత్నిస్తుంది. అయితే భారత్ బౌలర్లు ఆసీస్ జోరుకు ఏమేరకు అడ్డుకట్ట వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మరికొద్దిసేపట్లో ఇండియా, ఆసీస్ మూడో టెస్టు లో భాగంగా రెండో రోజు ఆట ప్రారంభమవుతుంది. మొదటి రోజు ఆసీస్ హవా కొనసాగింది. ఆసీస్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో టీమిండియా 109 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు భారత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టింది. ఫలితంగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.