Vaibhav Suryavanshi: ఏం కొట్టావ్ భయ్యా.. ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికారేసిన వైభవ్ సూర్యవంశీ.. బౌండరీల వర్షం..

అతడి టాలెంట్ చూసి అంతా ఫిదా అయిపోయారు. కుర్రాడే అయినా బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం, ఆమోఘం అంటూ ప్రశంసలు కురిపించారు.

Courtesy @ EspnCricinfo

Vaibhav Suryavanshi: భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి దుమ్మురేపాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో చెలరేగిపోయాడు. ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. బౌండరీల వర్షం కురిపించాడు. ఎలాంటి బెరుకు లేకుండా ధాటిగా బ్యాటింగ్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. వేగంగా రన్స్ చేయడానికి కేరాఫ్ గా మారాడు వైభవ్. తాజాగా ఆసీస్ తో మ్యాచ్ లోనూ అదే దూకుడు ప్రదర్శించాడు.

ఆస్ట్రేలియా U-19తో జరిగిన తొలి యూత్ వన్డేలో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ తో చెలరేగాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. భారత జట్టుకు అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. 22 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 172.73. అతడి ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.

కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన వైభవ్.. ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. ఆసీస్ బౌలర్లను బెంబేలెత్తించాడు. దూకుడుగా ఆడే క్రమంలో వైభవ్ సూర్యవంశీ 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. అయితే, జట్టుకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. వైభవ్ ఔట్ అయినా.. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించాడు. ఆయుష్ మాత్రే నిరాశపరిచాడు. 6 పరుగులకే ఔటయ్యాడు.

ఇటీవల జరిగిన ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ తన విశ్వరూపం చూపించాడు. తనదైన బ్యాటింగ్ తో సెన్షేషనల్ అయిపోయాడు. అతడి టాలెంట్ చూసి అంతా ఫిదా అయిపోయారు. కుర్రాడే అయినా బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం, ఆమోఘం అంటూ ప్రశంసలు కురిపించారు. వైభవ్ కొట్టే షాట్స్ అందరి మతిపోయేలా చేశాయి. ఐపీఎల్ లో చూపిన దూకుడే ఇతర మ్యాచుల్లోనూ కంటిన్యూ చేస్తున్నాడు వైభవ్. క్రీజులోకి వచ్చిన వెంటనే ధనాధన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎవరైతే నాకేంటి అన్న రీతిలో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేస్తున్నాడు.

ఆస్ట్రేలియా అండర్ 19తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 226 పరుగుల టార్గెట్ ను అలవోకగా చేజ్ చేసింది. 30.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 227 రన్స్ చేసింది.

Also Read: ఇదికదా బాదుడంటే.. వన్డేల్లో రికార్డుల మోత మోగించిన స్మృతి మంధాన.. కోహ్లీ రికార్డ్‌ కూడా బద్దలు.. చివరిలో బిగ్ ట్విస్ట్..