Smriti Mandhana: ఇదికదా బాదుడంటే.. వన్డేల్లో రికార్డుల మోత మోగించిన స్మృతి మంధాన.. కోహ్లీ రికార్డ్‌ కూడా బద్దలు.. చివరిలో బిగ్ ట్విస్ట్..

Smriti Mandhana : మహిళల వన్డేల్లో స్మృతి మంధాన శతకాల సంఖ్య 13కు చేరింది. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో ..

Smriti Mandhana: ఇదికదా బాదుడంటే.. వన్డేల్లో రికార్డుల మోత మోగించిన స్మృతి మంధాన.. కోహ్లీ రికార్డ్‌ కూడా బద్దలు.. చివరిలో బిగ్ ట్విస్ట్..

Smriti Mandhana

Updated On : September 21, 2025 / 12:24 PM IST

Smriti Mandhana: ఇండియా మహిళ జట్టు వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్ల (australia women vs india women) మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా జట్టు స్టయిలిస్ బ్యాటర్ స్మృతి మంధాన వీరవిహారం చేసింది. 63 బంతుల్లోనే 125 పరుగులు చేసింది. అందులో 17 ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి.

Also Read: IND vs PAK : నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్.. టీమిండియా తుది జట్టులో ఆ రెండు మార్పులు ఖాయమా..?

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసింది. ఆ జట్టులో బెత్ మునీ 75 బంతుల్లో 138 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా స్కోర్ 400 పరుగులు దాటేసింది. ఆ తరవాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత మహిళలు జట్టు కొండంత లక్ష్యం ముందున్నా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. స్మృతి మంధాన చెలరేగిపోయింది.

మూడో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాధిన స్మృతి.. ఐదో ఓవర్లో 6, 4 కొట్టింది. ఆరో ఓవర్లో 4, 4, 6 కొట్టింది. ఆ తరువాతి ఓవర్లోనూ మరో రెండు ఫోర్లు కొట్టింది. దీంతో కేవలం 23 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ పూర్తి చేసింది. అదే దూకుడుతో ఆడిన స్మృతి మంధాన 50 బంతుల్లో సెంచరీ చేసింది. తద్వారా ప్రపంచంలో మహిళల వన్డే క్రికెట్‌లో ఫాసెస్ట్ సెంచరీ చేసిన రెండో మహిళా క్రికెటర్ గా స్మృతి రికార్డు నమోదు చేసింది.


మహిళల వన్డేల్లో స్మృతి మంధాన శతకాల సంఖ్య 13కు చేరింది. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో సుజీ బేట్స్‌తో కలిసి రెండో స్థానంలో ఉంది. లానింగ్ 15 సెంచరీలతో మొదటి స్థానంలో ఉంది.

స్మృతి మంధాన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డునుసైతం బ్రేక్ చేసింది. 50 బంతుల్లో సెంచరీ చేసిన స్మృతి.. విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 100)ను అధిగమించి వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాటర్ గా కొత్త రికార్డు నమోదు చేసింది.

అలాగే మహిళల వన్డేల్లో వేగవంతమైన సెంచరీ (50 బంతుల్లో 100) చేసిన రెండో బ్యాటర్ గా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్‌లానింగ్ 45 బంతుల్లోనే సెంచరీ చేసి ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. మరోవైపు ఈ ఏడాది వన్డేల్లో నాలుగు సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్ గా మంధాన నిలిచింది.


స్మృతి మంధాన వీరవిహారం చేసినప్పటికీ భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. 413 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత మహిళల జట్టు తడబాటుకు గురైంది. 47ఓవర్లలో 369 పరుగులకే భారత జట్టు ఆలౌట్ అయింది. దీంతో 43 పరుగులతో హర్మన్‌ సేన ఓటమి చవిచూసింది.