India vs Australia : ఆసీస్‌తో టీ20 సిరీస్‌.. చాహల్‌కు దక్కని చోటు.. లెగ్ స్పిన్నర్ రియాక్షన్ చూశారా?

India vs Australia : ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 23న విశాఖ వేదిగా తొలి మ్యాచ్ జరుగనుంది. ముగ్గురు స్పిన్నర్లతో 15 మంది సభ్యుల భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

India vs Australia : ప్రపంచ కప్ 2023 ఫైనల్లో పరాజయం తర్వాత ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే 5-మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ ఆస్ట్రేలియాతో తలపడే భారత్ టీ20 జట్టును ప్రకటించింది. ప్రపంచ కప్‌కు ముందు ఫార్మాట్‌లో ఆడిన జట్టులో ఎలాంటి చాలా మార్పులు చేయకుండానే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.

ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఏడాది నుంచి భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా గాయం కారణంగా తప్పుకున్నాడు. ప్రపంచ కప్ సమయంలో పాండ్యాకు గాయమైన సంగతి తెలిసిందే. అందుకే ఈ సిరీస్‌కు సూర్యకుమర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్‌ను మొదటి మూడు టీ20లకు వైస్ కెప్టెన్‌గా నియమించగా, శ్రేయాస్ అయ్యర్ చివరి రెండు టీ20లకు సూర్యకుమార్‌కు డిప్యూటీగా జట్టులో చేరబోతున్నాడు.

జట్టులో చోటు దక్కపోవడంపై అసహనం :

ప్రపంచ కప్ 2023 జట్టులో భాగమైన ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ, సూర్యకుమార్ మినహా చాలా మంది ఆటగాళ్లకు టీ20 సిరీస్‌కు విశ్రాంతి లభించింది. అందులో సంజు శాంసన్, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు కూడా చోటు దక్కలేదు. ఆగస్టులో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా లెగ్ స్పిన్నర్ చాహల్ భారత్ తరఫున చివరి టీ20లు ఆడాడు. వెస్టిండీస్ సిరీస్ కోసం టీ20 జట్టులో తన పేరు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశాడు.

Read Also : ODI World Cup 2023 awards : ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ గా కోహ్లీ.. ఎవ‌రెవ‌రికి ఏ అవార్డులు వ‌చ్చాయంటే..?

దాంతో సీనియర్ స్పిన్నర్ సోషల్ మీడియా వేదికగా ఇలా కన్నీళ్లతో కూడిన ఎమోజీని పోస్టును తన ఆవేదన వెలిబుచ్చాడు. ప్రపంచ కప్‌లో సైతం చాహల్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. లెగ్ స్పిన్నర్ చివరిసారిగా జనవరి 2023లో వన్డే మ్యాచ్ ఆడాడు. అయితే, సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ ఫింగర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్‌లతో పాటు కులదీప్ యాదవ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో చాహల్‌కు చోటు దక్కలేదు. చాహల్ పోస్టుకు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ముగ్గురు స్పిన్నర్లకు చోటు :

గాయం కారణంగా ప్రపంచ కప్‌కు దూరమైన ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ కోసం భారత్ తిరిగి తీసుకొచ్చింది. లెగ్ బ్రేక్ బౌలర్ రవి బిష్ణోయ్, ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ జట్టులోని ఇతర ఇద్దరు స్పిన్నర్లుగా చోటు దక్కింది.

సెప్టెంబరులో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో రెడ్-బాల్ క్రికెట్ ఆడిన చాహల్ సీనియర్ జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయాన్ని బాగానే సద్వినియోగపర్చుకున్నాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20లో యుజ్వేంద్ర హర్యానా తరపున 7 మ్యాచ్‌లలో 11 వికెట్లు పడగొట్టాడు. ఇక, యూపీ తరఫున 7 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్‌కు కూడా టీ20 జట్టులో చోటు దక్కలేదు.

Yuzvendra Chahal T20I squad

భారత్ జట్టు :
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 షెడ్యూల్ ఇదే :

* 1 టీ20 : నవంబర్ 23న విశాఖపట్నంలో తొలి మ్యాచ్

* 2వ టీ20 : నవంబర్ 26న తిరువనంతపురంలో

* 3వ టీ20 : నవంబర్ 28న గౌహతిలో

* 4వ టీ20 : డిసెంబర్ 1న రాయ్‌పూర్‌లో

* 5వ టీ20 : డిసెంబర్ 3న బెంగళూరులో

Read Also : KL Rahul: ప్రపంచకప్ ఫైనల్లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై షోయబ్ మాలిక్ విమర్శలు

ట్రెండింగ్ వార్తలు