India Vs Bangladesh : టీ20 సిరీస్‌ నుంచి శుభ్‌మ‌న్ గిల్‌ ఔట్..! ఇషాంత్ కిష‌న్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..

శుభ్‌మ‌న్ గిల్‌ తో పాటు టీమిండియా ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, సిరాజ్ లకు కూడా బంగ్లా వర్సెస్ ఇండియా టీ20 సిరీస్ కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Rishabh Pant and Shubman Gill, Ishan Kishan

India Vs Bangladesh T20 series : ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే బంగ్లా ప్లేయర్లు చెన్నై చేరుకున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. టెస్ట్ సిరీస్ పూర్తయ్యాక.. ఇరు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. అయితే, బంగ్లాతో టీ20 సిరీస్ కు టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మ‌న్ గిల్‌ కు విశ్రాంతిని ఇచ్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో టీమిండియా ఆడే పది టెస్టులకు జట్టులో గిల్ ఉండే అవకాశం ఉంది. త్వరలో న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో గిల్ తో పాటు కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Read : Najmul Hossain: ఇండియాతో జరిగేది సవాలుతో కూడుకున్న సిరీస్.. అయితే..: బంగ్లాదేశ్ కెప్టెన్

శుభ్‌మ‌న్ గిల్‌ తో పాటు టీమిండియా ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, సిరాజ్ లకు కూడా బంగ్లా వర్సెస్ ఇండియా టీ20 సిరీస్ కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కుసైతం రెస్ట్ ఇస్తే.. చాలా రోజులుగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ జట్టులో పునరాగమనం చేసే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

టీమిండియా యువ ప్లేయర్ ఇషాన్ కిషన్ బీసీసీఐకి ఆగ్రహం తెప్పించి జట్టులో చోటు కోల్పోయాడు. దేశవాళీ రంజీ ట్రోఫీ ఆడాలని ఆదేశించినా పెడచెవిన పెట్టి వేటుకు గురయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కూడా ఇషాన్ కిషన్ కోల్పోయాడు. అయితే అతను మళ్లీ ఇండియా జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‍లో బరిలోకి దిగాడు. దీంతో ఇషాంత్ ను బంగ్లాతో జరిగే టీ20 సిరీస్ కు ఎంపిక చేసేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

Also Read : IND vs BAN : భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ టెస్టు సిరీసుల్లో అత్య‌ధిక ప‌రుగులు, వికెట్లు తీసిన ఆట‌గాళ్లు ఎవ‌రంటే?

ఇండియా – బంగ్లా జట్ల మధ్య టెస్ట్, టీ20 మ్యాచ్‌ల‌ షెడ్యూల్ ఇలా..
సెప్టెంబర్ 19 – 23 వరకు తొలి టెస్టు మ్యాచ్ (ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4గంటల వరకు)
సెప్టెంబర్ 27- అక్టోబర్ 01 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ (ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4గంటల వరకు)
అక్టోబర్ 6వ తేదీన : తొలి టీ20 మ్యాచ్ (రాత్రి 7గంటలకు)
అక్టోబర్ 9వ తేదీన : రెండో టీ20 మ్యాచ్ (రాత్రి 7గంటలకు)
అక్టోబర్ 12వ తేదీన : మూడో టీ20 మ్యాచ్ (రాత్రి 7గంటలకు)