Najmul Hossain: ఇండియాతో జరిగేది సవాలుతో కూడుకున్న సిరీస్.. అయితే..: బంగ్లాదేశ్ కెప్టెన్
మ్యాచులోని చివరి సెషన్‌లో ఫలితం రాబట్టాల్సి ఉంటుందని, ఆ సమయంలో..

India vs Bangladesh: భారత్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచుల్లోనూ విజయం సాధించాలనుకుంటున్నామని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ అన్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. ఇటీవలే పాకిస్థాన్ జట్టును బంగ్లాదేశ్ 2-0తో ఓడించింది. దీంతో పాక్ గడ్డపై బంగ్లాదేశ్ మొదటి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది.
బంగ్లాదేశ్, భారత్ మధ్య సెప్టెంబర్ 19 నుంచి రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇండియాతో జరిగేది సవాలుతో కూడుకున్న సిరీస్ అని అన్నాడు. అయితే, పాక్‌తో టెస్టు సిరీస్ గెలవడంతో బంగ్లాదేశ్ జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని చెప్పాడు.
తమ దేశ యావత్తూ ఆత్మవిశ్వాసంతో ఉందని తెలిపాడు. ప్రతి సిరీస్ ఒక అవకాశంలాంటిదని, రెండు టెస్ట్ మ్యాచులనూ గెలవాలని భావిస్తున్నామని చెప్పాడు. తమ పనిని తాము చేస్తే మంచి ఫలితాన్ని రాబట్టవచ్చని అన్నాడు. తమకంటే భారత్ ర్యాంకింగ్స్‌లో చాలా ముందు ఉందని, అయితే, ఇటీవలి కాలంలో తాము చాలా బాగా ఆడామని చెప్పాడు.
టెస్టు మ్యాచు జరిగే ఐదు రోజులూ బాగా ఆడాల్సి ఉంటుందని, ఇదే తమ లక్ష్యమని అన్నాడు. మ్యాచులోని చివరి సెషన్‌లో ఫలితం రాబట్టాల్సి ఉంటుందని, ఆ సమయంలో మ్యాచు ఏ దిశలోనైనా వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపాడు. గెలుస్తామన్న విశ్వాసంతో, పూర్తి శక్తిసామర్థ్యాలతో ఆడతామని అన్నాడు.
Neeraj Chopra: డైమండ్ లీగ్ 2024 ఫైనల్స్.. నీరజ్ చోప్రాకు మళ్లీ రెండో స్థానమే.. ఫ్రైజ్‌మనీ ఎంతంటే?