IND vs ENG 4th test : ముగిసిన రెండో రోజు ఆట.. భార‌త్ 219/7

రాంచీలో భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది.

India vs England 4th Test

ముగిసిన రెండో రోజు ఆట‌
రాంచీలో భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. భార‌త జ‌ట్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 219 ప‌రుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (30), కుల్దీప్ యాద‌వ్‌(17)లు క్రీజులో ఉన్నారు. భార‌త్ ఇంకా 134 ప‌రుగ‌లు వెనుక‌బ‌డి ఉంది.

జైస్వాల్ క్లీన్‌బౌల్డ్‌..
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ (73; 117 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్‌) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 46.4వ ఓవ‌ర్‌లో 161 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

టీ బ్రేక్‌..
రెండో రోజు ఆట‌లో టీ విరామానికి భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 131 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (54), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (1) లు క్రీజులో ఉన్నారు.

వ‌రుస ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు తీసిన బ‌షీర్‌..
షోయ‌బ్ బ‌షీర్ వ‌రుస ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ముందుగా ర‌జ‌త్ పాటిదార్ (17) ఎల్బీగా ఔట్ చేసిన అత‌డు త‌న త‌రువాతి ఓవ‌ర్‌లో ర‌వీంద్ర జ‌డేజా (12)ను పెవిలియ‌న్‌కు పంపాడు. దీంతో భార‌త్ 36.5 వ ఓవ‌ర్‌లో 130 ప‌రుగుల వ‌ద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది.

య‌శ‌స్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ
టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ త‌న ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. టామ్‌హార్డ్లీ బౌలింగ్‌లో సింగిల్ తీసిన జైస్వాల్ 89 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. 32 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 105 2. జైస్వాల్ (50), ర‌జ‌త్ పాటిదార్ (12) లు క్రీజులో ఉన్నారు.

శుభ్‌మ‌న్ గిల్ ఔట్‌..
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో శుభ్‌మ‌న్ గిల్ (38) ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో భార‌త్ 24.1 ఓవ‌ర్‌లో 86 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

లంచ్ బ్రేక్‌..
రెండో రోజు ఆట‌లో లంచ్ విరామానికి భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్ట‌పోయి 34 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ (27), శుభ్‌మ‌న్ గిల్ (4) లు క్రీజులో ఉన్నారు.

రోహిత్ శ‌ర్మ ఔట్‌
ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేశామ‌న్న ఆనందం భార‌త్ కు ఎంతో సేపు మిగ‌ల‌లేదు. తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భార‌త్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ (2) బెన్‌ఫోక్స్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 2.4వ ఓవ‌ర్‌లో 4 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 353 ఆలౌట్‌
రాంచీ టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 353 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో జోరూట్ (122*) సెంచ‌రీ చేశాడు. రాబిన్స‌న్ (58) హాఫ్ సెంచ‌రీ చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా నాలుగు వికెట్లు తీశాడు. ఆకాశ్‌దీప్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా మ‌హ్మ‌ద్ సిరాజ్ రెండు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఓ వికెట్ సాధించాడు.

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన జ‌డేజా
జ‌డేజా విజృంభించాడు. ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీశాడు. 103వ ఓవ‌ర్ వేసిన జ‌డేజా మొద‌టి బంతికి రాబిన్స‌న్‌(58)ను ఔట్ చేయ‌గా నాలుగో బంతికి షోయ‌బ్ బ‌షీర్ (0)ను పెవిలియ‌న్‌కు చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్ 102.4వ ఓవ‌ర్‌లో 349 ప‌రుగుల వ‌ద్ద తొమ్మిది వికెట్లు కోల్పోయింది.

రాబిన్స‌న్ హాఫ్ సెంచ‌రీ..
ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఆడుతున్న రాబిన్స‌న్ బ్యాటింగ్‌లో అద‌ర‌గొడుతున్నాడు. దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. జ‌డేజా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 81 బంతుల్లో అర్ద‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. టెస్టుల్లో అత‌డికి ఇదే తొలి హాఫ్ సెంచ‌రీ కావ‌డం విశేషం. 100 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 346/7. రూట్ (118), రాబిన్స‌న్ (58) లు క్రీజులో ఉన్నారు.

ప్రారంభ‌మైన రెండో రోజు ఆట‌
ఓవ‌ర్ నైట్ స్కోరు ఏడు వికెట్ల న‌ష్టానికి 302 ప‌రుగుల‌తో ఇంగ్లాండ్ రెండో రోజు ఆట‌ను ప్రారంభించింది. జోరూట్ (106), రాబిన్స‌న్ (31) లు క్రీజులో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు