IRE vs IND 3rd T20 : ఒక్క బంతి ప‌డ‌లేదు.. మ్యాచ్ ర‌ద్దు.. సిరీస్ టీమ్ఇండియాదే

వ‌రుణుడే గెలిచాడు. ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే డ‌బ్లిన్ వేదిక‌గా జ‌ర‌గాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ను అంపైర్లు ర‌ద్దు చేశారు.

IRE vs IND 3rd T20

IRE vs IND : వ‌రుణుడే గెలిచాడు. ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే డ‌బ్లిన్ వేదిక‌గా జ‌ర‌గాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ను అంపైర్లు ర‌ద్దు చేశారు. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో మొద‌టి రెండు మ్యాచుల్లో గెలిచిన భార‌త్ 2-0 తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Team India : నంబ‌ర్ 4 స్థానానికి స‌రైనోడు ఎవ‌రు..? 2019 ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత నుంచి 12 మంది ఆడితే..

బుమ్రా నాయ‌క‌త్వంలో క్లీన్ స్వీప్ చేయాల‌ని బావించిన భార‌త ఆశ‌ల‌పై వ‌రుణుడు నీళ్లు చ‌ల్లాడు. మ్యాచ్ ఆరంభానికి ముందే వ‌ర్షం రావ‌డంతో టాస్ వేయ‌డం సాధ్యం ప‌డ‌లేదు. వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో చాలా స‌మ‌యం వృధా అయ్యింది. ఎట్ట‌కేల‌కు వ‌రుణుడు శాంతించిన అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్త‌డిగా మార‌డం, స‌మ‌యం ఎక్కువ‌గా లేక‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇక భార‌త జ‌ట్టు ఆగ‌స్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా క‌ప్‌తోనే తిరిగి బ‌రిలోకి దిగ‌నుంది. హైబ్రిడ్ మోడ్‌లో నిర్వ‌హించ‌నున్న ఈ టోర్నీలో ఆరు జ‌ట్లు పాల్గొన‌నున్నాయి. మొత్తం ఆరు జ‌ట్లను రెండు గ్రూపులుగా విభ‌జించారు. గ్రూప్‌-ఏలో భార‌త్‌, పాకిస్తాన్‌తో పాటు నేపాల్ ఉండ‌గా.. గ్రూప్‌-బిలో శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. గ్రూప్ ద‌శ‌లో ఆరు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్‌-4కు అర్హ‌త సాధిస్తాయి.

ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్

ఆగస్టు 30 – పాకిస్థాన్ vs నేపాల్ – వేదిక‌ ముల్తాన్

ఆగస్టు 31 – బంగ్లాదేశ్ vs శ్రీలంక – వేదిక‌ క్యాండీ

సెప్టెంబర్ 2 – పాకిస్తాన్ vs భారతదేశం – వేదిక‌ క్యాండీ

సెప్టెంబర్ 3 – బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక‌ లాహోర్

సెప్టెంబర్ 4 – భారతదేశం vs నేపాల్ – వేదిక‌ క్యాండీ

సెప్టెంబర్ 5 – శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక‌ లాహోర్

సెప్టెంబర్ 6 – సూపర్ 4s – A1 vs B2 – వేదిక‌ లాహోర్

సెప్టెంబర్ 9 – B1 vs B2 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 10 – A1 vs A2 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 12 – A2 vs B1 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 14 – A1 vs B1 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 15 – A2 vs B2 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 17 – ఫైనల్ – వేదిక‌ కొలంబో

ట్రెండింగ్ వార్తలు