India vs New Zealand : న్యూజిలాండ్ వర్సెస్ భారత్ తొలి వన్డే : టాస్ నెగ్గిన శుభ్‌మన్ గిల్.. తుది జట్టు ఇదే.. నలుగురు బౌలర్లతో బరిలోకి
India vs New Zealand : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ప్రారంభమైంది.
- Harish Thanniru
- Updated on- November 4, 2026 / 07:52 AM IST
India and New Zealand
India vs New Zealand : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించింది.
వాస్తవానికి మ్యాచ్ 7.30గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా వర్షం రాడంతో టాస్ కాస్త ఆలస్యమైంది. కొద్దిసేపటికే వాతావరణం అనుకూలించడంతో అపైర్లు టాస్ వేశారు. షెడ్యూల్ టైమ్ కంటే 20 నిమిషాల ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది.
ఇదిలాఉంటే.. నలుగురు పేసర్లతో భారత్ జట్టు తొలివన్డేలో బరిలోకి దిగుతుంది. అన్షుల్ కాంబోజ్, అకిబ్ నబీ, గర్నూర్, అర్ష్‌దీప్ సింగ్‌లకు తుది జట్టులో అవకాశం దక్కింది. బౌలింగ్‌కు కాస్త అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధిర్, అన్షుల్ కాంబోజ్, అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్
న్యూజిలాండ్ జట్టు ఇదే..
టిమ్ సీఫర్ట్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, కేల్ జేమీసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నెర్
