IND vs NZ: టీమిండియా తొలి సెష‌న్‌లోనే ఆ స్కోర్‌ను దాటాలి.. అప్పుడే మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది : అనిల్ కుంబ్లే

భారత్ జట్టుకు శనివారం ఆట కీలకంగా మారనుంది. భారత్ బ్యాటర్లు 125 పరుగుల లోటును పూడ్చుకోవడంతో పాటు న్యూజిలాండ్ జట్టు ముందు 200కుపైగా పరుగుల ఆధిక్యాన్ని ఉంచాలి.

IND vs NZ 1st Test Match

IND vs NZ 1st Test Match: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 46 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ఆ తరువాత న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 406 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటర్లు మ్యాచ్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. భారత్ ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్ (70) ఉన్నాడు. ఇంకా పంత్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్ క్రీజులోకి రావాల్సి ఉంది. వీరంతా ఆశించిన స్థాయిలో పరుగులు రాబడితే భారత్ జట్టు మెరుగైన స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

Also Read: IND vs BAN : ముగిసిన మూడో రోజు ఆట‌.. ఇంకా 125 ప‌రుగుల వెనుకంజ‌లో భార‌త్‌

భారత్ జట్టుకు శనివారం ఆట కీలకంగా మారనుంది. భారత్ బ్యాటర్లు 125 పరుగుల లోటును పూడ్చుకోవడంతో పాటు న్యూజిలాండ్ జట్టు ముందు 200కుపైగా పరుగుల ఆధిక్యాన్ని ఉంచాలి. నాలుగో రోజు భారత్ ఆలౌట్ కాకపోతే మ్యాచ్ గెలవొచ్చు లేదా డ్రా చేసుకోవచ్చు. న్యూజిలాండ్ జట్టు ముందు 150లోపు పరుగులు మాత్రమే టార్గెట్ ఉంచితే టీమిండియా ఓటమి పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. శనివారం భారత బ్యాటర్ల పోరాటం ఎంత వరకు వెళ్తుందో వేచిచూడాల్సిందే.

Also Read: Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. టెస్టుల్లో 9 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు మ్యాచ్ పై మాజీ దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగో రోజు ఆటలో టీమిండియా దూకుడు కొనసాగించాలని కుంబ్లే పేర్కొన్నారు. తొలి సెషన్ లోనే లీడ్ కు వస్తే మ్యాచ్ ఆసక్తికరంగా మారుతుందని చెప్పారు. ప్రస్తుతం టీమిండియా 125 పరుగులు వెనుకబడి ఉంది.. మొదటి సెషన్ లో ఆ పరుగులను పూర్తిచేయడంతోపాటు అదనంగా మరికొన్ని పరుగులు చేసేలా టీమిండియా బ్యాటింగ్ ఉంటే మ్యాచ్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంటుందని, భారత్ గెలుపు అవకాశాలు కూడా ఉంటాయని కుంబ్లే అన్నారు.