Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. టెస్టుల్లో 9 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో

టెస్టు క్రికెట్‌లో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు.

Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. టెస్టుల్లో 9 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో

Virat Kohli Completes 9,000 Test Runs, Becomes Fourth Indian To Achieve This Feat

Updated On : October 18, 2024 / 5:02 PM IST

టెస్టు క్రికెట్‌లో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. టెస్టుల్లో 9 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. బెంగ‌ళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ దీన్ని అందుకున్నాడు. వ్య‌క్తిగ‌త స్కోరు 53 ప‌రుగుల వ‌ద్ద కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌లో 9 వేల ప‌రుగులు చేసిన నాలుగో భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

కోహ్లీ కంటే ముందు టీమ్ఇండియా త‌రుపున ముగ్గురు ఆట‌గాళ్లు స‌చిన్ టెండూల్క‌ర్ (15,921), రాహుల్ ద్ర‌విడ్‌(13,265), సునీల్ గ‌వాస్క‌ర్ (10,122)లు మాత్ర‌మే టెస్టుల్లో 9వేల కంటే ఎక్కువ ప‌రుగులు సాధించారు.

IND vs NZ : త‌న దురదృష్టాన్ని చూసి తలప‌ట్టుకున్న రోహిత్ శ‌ర్మ‌.. ఇలా ఔట్ అవుతాడ‌ని క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌డు

భార‌త్ త‌రుపున టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు..

స‌చిన్ టెండూల్క‌ర్ – 15921 ప‌రుగులు
రాహుల్ ద్ర‌విడ్ – 13265 ప‌రుగులు
సునీల్ గ‌వాస్క‌ర్ – 10122 ప‌రుగులు
విరాట్ కోహ్లీ – 9000* ప‌రుగులు
వీవీఎస్ లక్ష్మ‌ణ్ – 8781 ప‌రుగులు

IND vs NZ : సెహ్వాగ్ రికార్డు బ్రేక్.. టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆరో ప్లేయ‌ర్‌గా కివీస్ మాజీ కెప్టెన్ ..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో 43 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ (62), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (62)లు క్రీజులో ఉన్నారు. భార‌త్ ఇంకా 142 ప‌రుగుల వెనుకంజ‌లో ఉంది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 402 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 46 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే.