IND vs NZ : సెహ్వాగ్ రికార్డు బ్రేక్.. టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆరో ప్లేయ‌ర్‌గా కివీస్ మాజీ కెప్టెన్ ..

టెస్టుల్లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టీమ్ సౌథి అరుదైన ఘ‌న‌త సాధించాడు.

IND vs NZ : సెహ్వాగ్ రికార్డు బ్రేక్..  టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆరో ప్లేయ‌ర్‌గా కివీస్ మాజీ కెప్టెన్ ..

Most Sixes In Test Tim Southee Surpasses Virender Sehwag On The List

Updated On : October 18, 2024 / 3:00 PM IST

IND vs NZ : టెస్టుల్లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టీమ్ సౌథి అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్ల జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నాడు. బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచుల్లో అత‌డు దీన్ని అందుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు.

ఈ మ్యాచ్‌లో సౌథి 73 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాది 65 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన నాలుగు సిక్స‌ర్ల‌తో టెస్టుల్లో అత‌డి సిక్స‌ర్ల సంఖ్య 93కి చేరింది. వీరేంద్ర సెహ్వాగ్ 104 మ్యాచుల్లో 91 సిక్స‌ర్లు బాద‌గా సౌథి 103 మ్యాచుల్లోనే అత‌డి రికార్డును బ్రేక్ చేయ‌డం విశేషం.

PAK vs ENG : ప‌రువు కాపాడుకున్న పాకిస్థాన్‌.. మూడున్న‌రేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌.. రెండో టెస్టులో ఇంగ్లాండ్ పై విజ‌యం

టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో 131 సిక్స‌ర్ల‌తో బెన్‌స్టోక్స్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్‌, ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్‌, క్రిస్‌గేల్ లు వ‌రుస‌గా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టి ఆట‌గాళ్లు..

* బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్‌) – 105 మ్యాచుల్లో 131 సిక్స‌ర్లు
* బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్) – 101 మ్యాచుల్లో 107 సిక్స‌ర్లు
* ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 96 మ్యాచుల్లో 100 సిక్స‌ర్లు
* క్రిస్ గేల్ (వెస్టిండీస్‌) – 103 మ్యాచుల్లో 98 సిక్స‌ర్లు

IND vs NZ : బెంగ‌ళూరులో మ్యాచ్ అంటే చాలు.. ర‌చిన్ ర‌వీంద్ర బాదుడే బాదుడు.. రికార్డు సెంచ‌రీ.. 12 ఏళ్ల త‌రువాత‌
* జాక్వ‌స్ కలిస్ (ద‌క్షిణాఫ్రికా) – 166 మ్యాచుల్లో 97 సిక్స‌ర్లు
* టిమ్ సౌథి (న్యూజిలాండ్‌) – 103 మ్యాచుల్లో 93 సిక్స‌ర్లు
* వీరేంద్ర సెహ్వాగ్ (భార‌త్) – 104 మ్యాచుల్లో 91 సిక్స‌ర్లు
* బ్రియాన్ లారా (వెస్టిండీస్‌) – 131 మ్యాచుల్లో 88 సిక్స‌ర్లు
* క్రిస్ కెయిర్న్స్ (న్యూజిలాండ్‌) – 62 మ్యాచుల్లో 87 సిక్స‌ర్లు
* రోహిత్ శర్మ (భార‌త్‌) – 61 మ్యాచుల్లో 87 సిక్స‌ర్లు.