Most Sixes In Test Tim Southee Surpasses Virender Sehwag On The List
IND vs NZ : టెస్టుల్లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టీమ్ సౌథి అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నాడు. బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచుల్లో అతడు దీన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో సౌథి 73 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 65 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన నాలుగు సిక్సర్లతో టెస్టుల్లో అతడి సిక్సర్ల సంఖ్య 93కి చేరింది. వీరేంద్ర సెహ్వాగ్ 104 మ్యాచుల్లో 91 సిక్సర్లు బాదగా సౌథి 103 మ్యాచుల్లోనే అతడి రికార్డును బ్రేక్ చేయడం విశేషం.
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో 131 సిక్సర్లతో బెన్‌స్టోక్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత బ్రెండన్ మెక్‌కల్లమ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, క్రిస్‌గేల్ లు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టి ఆటగాళ్లు..
* బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) – 105 మ్యాచుల్లో 131 సిక్సర్లు
* బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్) – 101 మ్యాచుల్లో 107 సిక్సర్లు
* ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 96 మ్యాచుల్లో 100 సిక్సర్లు
* క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 103 మ్యాచుల్లో 98 సిక్సర్లు
IND vs NZ : బెంగళూరులో మ్యాచ్ అంటే చాలు.. రచిన్ రవీంద్ర బాదుడే బాదుడు.. రికార్డు సెంచరీ.. 12 ఏళ్ల తరువాత
* జాక్వస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 166 మ్యాచుల్లో 97 సిక్సర్లు
* టిమ్ సౌథి (న్యూజిలాండ్) – 103 మ్యాచుల్లో 93 సిక్సర్లు
* వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) – 104 మ్యాచుల్లో 91 సిక్సర్లు
* బ్రియాన్ లారా (వెస్టిండీస్) – 131 మ్యాచుల్లో 88 సిక్సర్లు
* క్రిస్ కెయిర్న్స్ (న్యూజిలాండ్) – 62 మ్యాచుల్లో 87 సిక్సర్లు
* రోహిత్ శర్మ (భారత్) – 61 మ్యాచుల్లో 87 సిక్సర్లు.