IND vs NZ : తన దురదృష్టాన్ని చూసి తలపట్టుకున్న రోహిత్ శర్మ.. ఇలా ఔట్ అవుతాడని కలలో కూడా ఊహించి ఉండడు
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దురదృష్టవశాత్తు ఔట్ అయ్యాడు.

IND vs NZ 1st Test Rohit Sharma Unlucky Dismissal Stuns Fans
IND vs NZ : బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దురదృష్టవశాత్తు ఔట్ అయ్యాడు. అర్థశతకం బాది మంచి ఊపుమీదున్న రోహిత్ శర్మ అజాజ్ పటేల్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడాడు. అయితే.. ఊహించని విధంగా బౌల్డ్ అయ్యాడు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీతో పాటు మైదానంలోని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఔట్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది భారత్. 35 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ జట్టు స్కోరు 72 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ తనదైన శైలిలో బ్యాటింగ్ కొనసాగించాడు.
వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. హాఫ్ సెంచరీ బాదాడు. 22వ ఓవర్‌ను అజాజ్ పటేల్ వేశాడు. ఈ ఓవర్‌లోని 5వ బంతిని రోహిత్ ఫార్వర్డ్ డిఫెన్స్‌గా ఆడాడు.
బ్యాట్‌ను తాకిన బంతి.. ప్యాడ్స్, బ్యాట్ మధ్య ఉన్న ఖాళీ నుంచి వన్ స్టెప్ తీసుకుని నినాదంగా వికెట్లు తాకింది. రోహిత్ గమనించి వెనక్కి తిరిగిలోపే బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో తన దురదృష్టాన్ని చూసి రోహిత్ శర్మ తలపట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 63 బంతులు ఆడి 8 ఫోర్లు, 1 సిక్స్ బాది 52 పరుగులు చేశాడు.
ప్రస్తుతం భారత్ 26 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. కోహ్లీ (19), సర్ఫరాజ్ ఖాన్ (13) క్రీజులో ఉన్నారు. టీమ్ఇండియా ఇంకా 235 పరుగుల వెనుకంజలో ఉంది.
well played captain but no so lucky today #INDvNZ #RohitSharma𓃵 pic.twitter.com/1g91RE0snr
— Sachin (@ha_me_hu) October 18, 2024