Virat Kohli (Image Source Via EspnCricInfo)
Ind Vs NZ: న్యూజిలాండ్ తో మూడో వన్డేలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అదరగొట్టాడు. సెంచరీతో కదం తొక్కాడు. 91 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ఓ ఎండ్ లో వరుసగా వికెట్లు పడుతున్నా కోహ్లి మాత్రం వెనక్కి తగ్గలేదు. ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో శతకం పూర్తి చేసుకున్నాడు. వన్డే కెరీర్ లో కోహ్లికి ఇది 54వ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఇండియా ముందు 338 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.