Abhishek Sharma Pic Courtesy @ EspnCricInfo
India vs New Zealand : మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 153 పరుగులే చేసింది. 154 పరుగుల టార్గెట్ ను టీమిండియా అలవోకగా చేజ్ చేసింది. సంజూ శాంసన్ డకౌట్ అయినా.. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ చెలరేగారు. హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు.
ముఖ్యంగా అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 51 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లోనే 57 రన్స్ చేశాడు. 3 సిక్సులు, 6 ఫోర్లు బాదాడు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో 10 ఓవర్లలోనే భారత్ విక్టరీ కొట్టింది. 2 వికెట్ల నష్టానికి 155 రన్స్ చేసింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్ ను 3-0 తేడాతో భారత్ దక్కించుకుంది.
అభిషేక్ శర్మ ఊచకోత..
ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ పవర్ ఫుల్ బ్యాటింగ్ చేశాడు. క్రీజులోకి వచ్చింది మొదలు బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నాడు. బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ తరపున టీ20లలో ఇదే సెకండ్ ఫాసెస్ట్ హాఫ్ సెంచరీ. యువరాజ్ సింగ్ (12 బంతుల్లో హాఫ్ సెంచరీ) తొలి స్థానంలో ఉన్నాడు.