462 పరుగులకు టీమిండియా ఆలౌట్.. న్యూజిలాండ్‌ ముందు స్వల్ప లక్ష్యం

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌట్ అయింది.

Pic Credit: BCCI Twitter

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 99.3 ఓవర్లకు 462 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం టీమిండియా కేవలం 106 పరుగుల ఆధిక్యంలో ఉంది. సర్ఫరాజ్ ఖాన్‌ కెరీర్‌లో తొలి అంతర్జాతీయ సెంచరీ చేశాడు. కెరీర్‌లో ఆడిన నాలుగో టెస్టులోనే అతడు శతకం చేయడం గమనార్హం.

రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్‌ 35, రోహిత్ శర్మ 52, విరాట్ కోహ్లీ 70, సర్ఫరాజ్‌ ఖాన్ 150, రిషబ్ పంత్ 99, కేఎల్‌ రాహుల్ 12, రవీంద్ర జడేజా 5, రవిచంద్రన్ అశ్విన్ 15, కుల్దీప్ యాదవ్ (నాటౌట్) 6 పరుగులు చేశారు. బుమ్రా, సిరాజ్ డకౌట్‌గా వెనుదిరిగారు. కాగా, న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ ప్రారంభించగానే వర్షం పడింది.

Viral Video: ఐఐటీలోని మెస్‌లో ఎలుకలు.. చూసి వికారానికి గురైన విద్యార్థులు