IND Vs NZ WTC Final: ఉదయించిన సూర్యుడు.. చిగురించిన ఆశలు.. టాస్ కివీస్‌దే!

ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. సౌతాంప్టన్‌లో జరగాల్సిన ఈ మ్యాచ్‌ మొదటిరోజు వర్షం కారణంగా టాస్ కూడా పడకుండా ముగిసింది.

India vs New Zealand WTC Final: IND Vs NZ WTC 2021 Final: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. సౌతాంప్టన్‌లో జరగాల్సిన ఈ మ్యాచ్‌ మొదటిరోజు వర్షం కారణంగా టాస్ కూడా పడకుండా ముగిసింది. కానీ రెండో రోజు అభిమానులకు ఊరట కలిగించేలా నివేదికలు వచ్చాయి. సౌతాంప్టన్ వాతావరణం రెండవ రోజు సాధారణ స్థితిలో ఉందని, దీనితో, మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇవాళ(19 జూన్ 2021) 85 నుంచి 90 ఓవర్లు వరకు ఆడే అవకాశం ఉంది.

ఎట్టకేలకు సూర్యుడు సౌతాంప్టన్‌లో ఉదయించగా.. అభిమానుల ఆశలు చిగురించాయి. ఈ క్రమంలోనే టాస్‌లో న్యూజిలాండ్ గెలిచింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

తుది జట్లు:
ఇండియా(Playing XI): రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్, చేతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ(C), అజింక్య రహానె, రిషబ్ పంత్(wk), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్ (Playing XI): టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(C), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, బిజె వాట్లింగ్ (WK), కోలిన్ డి గ్రాండ్‌హోమ్, కైల్ జామిసన్, నీల్ వాగ్నెర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్

వాస్తవానికి టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని నిన్నటివరకు సూచించిన క్రికెట్ ఎక్స్‌పెర్ట్స్ వర్షంతో పరిస్థితులు మారడంతో.. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకుంటుదని అంచనా వేశారు. పిచ్‌పై మాయిశ్చర్ స్వింగ్ బౌలర్లకు అనుకూలిస్తుందని చెప్పారు. అలాగే మాయిశ్చర్ కలిగిన పిచ్‌పై అశ్విన్ రాణించగలడని, భారత్ టాస్ గెలిస్తే ఫీల్డింగే తీసుకోవాలని అనుకున్నారు. అయితే టాస్ కివీస్ గెలవడంతో చివరకు ఫస్ట్ బ్యాటింగ్ భారత్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు