Rahul
India vs South Africa : టీమిండియా – భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ పై వరుణుడి ప్రభావం కనిపించింది. మ్యాచ్ జరుగుతున్న ప్రాంతంలో భారీగా వర్షం కురిసింది. గ్యాప్ ఇవ్వకుండా వాన దంచికొడుతుండడంతో ఒక్క బంతి కూడా పడలేదు. మ్యాచ్ ఆడటానికి అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో..రెండో రోజు ఆట రద్దయినట్లు అంపైర్లు ప్రకటించారు. సెంచూరీయన్ లో ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఉదయం నుంచి భారీ వర్షం పడింది. లంచ్ అయిన తర్వాత..వర్షం తగ్గుముఖం పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
అలానే పడుతుండడంతో క్రికేటర్లు డ్రెస్సింగ్ రూమ్ కు పరిమితం కావాల్సి వచ్చింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే…టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ తన బ్యాట్ పవర్ చూపించాడు. సెంచరీతో కదం తొక్కాడు. తొలి రోజు ఆటలో ఇతని ఆటనే హైలెట్. 248 బంతులను ఎదుర్కొన్న ఈ బ్యాట్స్ మెన్…122 పరుగులు సాధించాడు. ఇతనికి జోడిగా అజంక్యా రహానే 40 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసి పటిష్టస్థితిలో నిలిచింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (60), పుజరా (0), కెప్టెన్ కోహ్లీ (35) పరుగులు చేసి అవుట్ అయ్యారు.