అభిమానం ఎక్కువైంది: రోహిత్ శర్మ.. కాళ్లు పట్టుకుంటే కింద పడిపోయాడు

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో తలపడుతోన్న టీమిండియా బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతుంది. పుణె వేదికగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్‍‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి రోహిత్ శర్మ కాళ్లపై పడిపోయాడు. కాళ్లపడి వెళ్లిపోతే బాగానే ఉంటుంది. కానీ, కాళ్ల మీద పడి రోహిత్ శర్మను కిందపడేశాడు. 

ఈ ఘటనపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. రెండో టెస్టు  రెండో సెషన్‌లో టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ కాళ్లను భద్రత వలయాన్ని దాటుకుని మైదానంలోకి ప్రవేశించిన అభిమాని ముద్దాడాడు. కంగారుపడిన రోహిత్ శర్మ తన కాళ్లని వెనక్కి తీసుకునే ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోయి అభిమానిపై పడిపోయాడు.

ఆ సమయంలో మ్యాచ్ కామెంటేటర్‌గా ఉన్న సునీల్ గవాస్కర్.. సెక్యూరిటీ సిబ్బందిపై సీరియస్ అయ్యాడు. మ్యాచ్ ఫ్రీగా చూద్దామని వచ్చారా.. పని పచేయడానికి వచ్చారా అని మండిపడ్డాడు. ఆదివారం విశాఖపట్నం వేదికగా ముగిసిన తొలి టెస్టులో, అంతకముందు మొహాలిలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ ఇలానే అభిమానులు మైదానంలోకి వచ్చి మ్యాచ్‌కి అంతరాయం కలిగించారు.