టాస్ గెలిచిన భారత్: తెలుగు కుర్రాడికి దక్కని చోటు

  • Publish Date - October 10, 2019 / 04:23 AM IST

విశాఖ వేదికగా తొలి టెస్టులో విజయకేతనం ఎగురవేసిన టీమిండియా రెండవ టెస్టు గెలుపు కోసం రంగంలోకి దిగింది. మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య రెండవ టెస్టు మ్యాచ్ మొదలైంది. టాస్‌ గెలిచిన భారత కెప్టెన్ ధోనీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నారు.

మ్యాచ్‌ జరిగే కొద్ది పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ వెల్లడించారు. ఈ మ్యాచ్‌కు తెలుగు ఆటగాగు హనుమ విహారి దూరమవగా.. అతని స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చారు. దక్షిణాఫ్రికా కూడా ఆఫ్‌స్పిన్నర్‌ పీట్‌ను పక్కకు పెట్టి పేసర్‌ అన్రిచ్ ను జట్టులోకి తీసుకుంది.

మరోవైపు పంత్ కు రెండవ టెస్ట్ లో కూడా చోటు దక్కలేదు. మొదటి టెస్టులో ఓపెనర్‌గా దిగి సత్తా చాటిన రోహిత్‌ శర్మ.. ఈ టెస్టులో కూడా అలాగే ఆడితే ఇక టెస్టుల్లో కూడా రోహిత్ ఓపెనర్ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇక కెప్టెన్‌గా కోహ్లికి ఇది 50వ టెస్టు.

జట్ల వివరాలు: 
టీమిండియా:  విరాట్‌ కోహ్లి (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, సాహా, జడేజా, అశ్విన్, ఇషాంత్, షమీ, ఉమేశ్‌ యాదవ్‌
దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్‌ (కెపె్టన్‌), ఎల్గర్, మార్క్‌రమ్, డి బ్రూయిన్, బవుమా, డి కాక్, ఫిలాండర్, రబడ, అన్రిచ్, ముత్తుసామి, మహరాజ్‌