రహానె సెంచరీ, డబుల్ సెంచరీ పరుగు దూరంలో రోహిత్

రాంచీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా-టీమిండియా రెండో రోజు ఆటను కొనసాగిస్తున్నాయి. ఓవర్ నైట్ స్కోరు 224/3తో ఆరంభించిన భారత్ ఆచితూచి అడుగులేస్తుంది. తొలి రోజు ఆటను ఆదుకున్న రోహిత్ రెండో రోజు డబుల్ సెంచరీ చేసేందుకు పరుగు దూరం మాత్రమే ఉంది. లంచ్ విరామానికి ముందు రోహిత్ 199పరుగులు చేయగలిగాడు. 

రోహిత్(117), రహానె(83)లతో మ్యాచ్ ఆరంభించి స్కోరు ముందుకు నడిపించారు. 169బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన రహానె 192బంతులకు 115; 17ఫోర్లు, 1సిక్సు చేయగలిగాడు. ఒత్తిడితో ఉన్న సమయంలో అడుగుపెట్టి కెరీర్లో 11వ టెస్టు సెంచరీ నమోదు చేసుకున్నాడు. జార్జి లిండే బౌలింగ్ లో రహానె క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

రవీంద్ర జడేజా దూకుడు మీద కనిపిస్తున్నాడు. 27బంతుల్లో 15పరుగులు బాదేశాడు. స్కోరు బోర్డును పరుగులు పెట్టేలా కనిపిస్తోంది ఈ జోడీ. రహానె స్థానంలో బ్యాటింగ్ కు దిగిన రవీంద్ర జడేజా(15)తో రోహిత్ శర్మ(199: 242బంతుల్లో 28ఫోర్లు, 4సిక్సులు) క్రీజులో ఉన్నారు.