IND vs WI: భారత జట్టుకు మరో ఇద్దరు.. స్టాండ్ బై ప్లేయర్లుగా!

ఫిబ్రవరిలో భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్, టీ20 సిరీస్ జరగబోతుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ.

Stand By Players

IND vs WI: ఫిబ్రవరిలో భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్, టీ20 సిరీస్ జరగబోతుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఈ స్క్వాడ్స్‌లో లేటెస్ట్‌గా మరో ఇద్దరు ఆటగాళ్లను చేర్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఆటగాళ్లను జట్టులో స్టాండ్-బైగా ఉంచాలని నిర్ణయించారు. అంటే ఈ ఆటగాళ్లు సిరీస్ జరిగే సమయంలో ఏ సమయంలోనైనా జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలి.

భారత జట్టుకు ఎప్పుడు అవసరం అనిపిస్తే, వెంటనే వారిని ప్లేయింగ్ XIలో చేర్చుకోవచ్చు. బీసీసీఐని ఉటంకిస్తూ ఓ నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, ఆటగాళ్లు కరోనాకు గురయ్యే అవకాశాన్ని తోసిపుచ్చలేమని, అప్పుడు సిరీస్ రద్దు చేసేందుకు మాత్రమే చూడకుండా.. అటువంటి పరిస్థితిలో కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలిన ఆటగాడి ప్లేస్‌లో ఈ ఆటగాళ్లను జట్టులో చేర్చడానికి టీమ్ ఇండియా బ్యాకప్ ప్లాన్‌ సిద్ధం చేసింది.

Samantha-Priyamani: నా భర్తకి హాట్ గా కనిపించిన సామ్.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్!

ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరు?
బీసీసీఐ స్టాండ్ బై గా ఉంచిన ఇద్దరు ఆటగాళ్లు తమిళనాడుకు చెందినవారే. తమిళనాడుకు చెందిన షారుక్ ఖాన్, ఆర్ సాయి కిషోర్‌లను స్టాండ్-బై ఆటగాళ్లుగా జట్టు ఉంచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మూడో వేవ్ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని బోర్డు భావించింది. అందుకే షారుఖ్, సాయి కిషోర్‌లను టీమ్‌లోకి తీసుకున్నట్లు చెబుతోంది.

Banner for 2nd Wife: ఎన్నికల్లో పోటీ చేయటానికి రెండో భార్య కావాలి’..బ్యానర్లు కట్టి ప్రకటన

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా షారుక్:
షారుక్ ఖాన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సాయి కిషోర్.. ఇటీవల ముగిసిన దేశవాళీ టోర్నీలు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీల్లో తమిళనాడు తరపున మంచి ప్రదర్శన చేశారు. షారుఖ్ బాగా బ్యాటింగ్ చేయగా, సాయి కిషోర్ బౌలింగ్‌లో రాణించాడు.