భారత్, వెస్టిండీస్ మధ్య 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తొలి టీ20 జరుగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ముమ్మర సాధన చేస్తున్నాయి. నిన్న ఉదయమంతా వెస్టిండీస్ క్రికెటర్లు సాధన చేయగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పర్యవేక్షణలో నెట్స్‌లో రోహిత్ పేస్ పిచ్‌పై, విరాట్ స్పిన్ పిచ్‌పై ఎక్కువసేపు సాధన చేశారు. వరల్డ్‌కప్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన భువనేశ్వర్ దాదాపు ఐదు నెలలు తర్వాత మైదానంలో అడుగుపెట్టాడు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో దూసుకెళ్తున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ మొదటి స్థానాన్ని అతను కైవసం చేసుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ 928 పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. స్టీవ్ స్మిత్, విలియమ్‌సన్, పుజారాలు తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఆసీస్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, లాబుషాంగే, ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ కూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకువచ్చారు. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ 900 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ జాబితాలో విండీస్ ప్లేయర్ జేసన్ హోల్డర్ 473 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. రవీంద్ర జడేజా 406 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.
Read More : మరో బయోపిక్: ట్రాజెడీ, ట్విస్ట్‌లు, విజయాలు.. వెండితెరపైకి క్రీడాకారిణి జీవితం