Hockey Junior Asia Cup 2023: కప్ కైవసం చేసుకున్న భారత్.. అమ్మాయిలు అంబరాన్నంటే ఆనందం.. క్యాష్ ప్రైజ్ ప్రకటన

విమెన్స్ హాకీ జూనియర్ ఆసియా కప్-2023 జపాన్ లోని కకమిగహరలో జరిగింది.

India win the 2023 Womens Hockey Junior Asia Cup

Hockey Junior Asia Cup – 2023 , Women’s: విమెన్స్ హాకీ జూనియర్ ఆసియా కప్-2023ని భారత్ (India) కైవసం చేసుకుంది. దక్షిణ కొరియా (South Korea) అమ్మాయిలను భారత జూనియర్ క్రీడాకారిణులు 2-1 తేడాతో ఓడించారు.

విమెన్స్ హాకీ జూనియర్ ఆసియా కప్-2023 జపాన్ లోని కకమిగహరలో జరిగింది. ఈ నెల 3 నుంచి నేటి వరకు నిర్వహించారు. భారత్ కు కప్ సాధించిన హాకీ జూనియర్ క్రీడాకారిణులకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటిస్తున్నట్లు హాకీ ఇండియా పేర్కొంది. అలాగే, టీమిండియాకు సహకరించిన సిబ్బందికి రూ.లక్ష చొప్పున అందిస్తామని చెప్పింది.

కప్ గెలిచాక భారత అమ్మాయిలు అంబరాన్నంటే సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను హాకీ ఇండియా పోస్ట్ చేసింది. భారత క్రీడాకారిణులకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. క్రికెట్ లో ఆస్ట్రేలియాలో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓడిన రోజే హాకీలో అమ్మాయిలు భారత్ కు కప్ సాధించిపెట్టడం విశేషం.


WTC Final: భారత్ ఘోర ఓటమి.. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా..