×
Ad

Womens Kabaddi World Cup : మహిళల కబడ్డీ ప్రపంచకప్ విజేత‌గా భార‌త్‌..

మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో (Womens Kabaddi World Cup ) భారత్‌ అద‌ర‌గొట్టింది.

India women win Kabaddi World Cup 2025

Womens Kabaddi World Cup : మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత్‌ అద‌ర‌గొట్టింది. వ‌రుస‌గా రెండోసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను కైవ‌సం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా ఈ టోర్నీలో (Womens Kabaddi World Cup) అడుగుపెట్టిన భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో మ‌రోసారి విజేత‌గా నిలిచింది. బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదిక‌గా సోమ‌వారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీని చిత్తు చేసింది. 35-28 తేడాతో ఓడించి స‌గ‌ర్వంగా ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. 11 దేశాలు ఈ టోర్నీలో పాల్గొన్నాయి.

ఈ టోర్నీ లీగ్ ద‌శలో భార‌త్.. థాయిలాండ్ ను (65-20), ఆతిథ్య బంగ్లాదేశ్ ను (43-18), జర్మనీ ను (63-22), ఉగాండా ను (51-16)లను ఓడించి సెమీస్‌కు చేరుకుంది. ఇక సెమీఫైనల్లో ఇరాన్‌ను 33-21 తేడాతో చిత్తు చేసి ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. ఫైనల్‌లో చైనీస్ తైపీని ఓడించి ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలుచుకుంది.

T20 World Cup 2026 schedule : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2026 షెడ్యూల్ నేడే రిలీజ్.. భారత్, పాక్ మ్యాచ్ ఆ రోజేనా?

ఫైన‌ల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. అయిన‌ప్ప‌టికి కూడా భార‌త్ ప్ర‌త్య‌ర్థికి అవ‌కాశం ఇవ్వ‌లేదు. బ‌ల‌మైన డిఫెన్స్‌, దూకుడైన ఆట‌తో మ్యాచ్‌లో ఫై చేయి సాధించింది. రీతూ నేగి సార‌థ్యంలో ఈ మెగాటోర్నీలో బ‌రిలోకి దిగిన భార‌త్ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా విజ‌యం సాధించ‌డం విశేషం.

IND vs SA : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఏ జ‌ట్టుకు సాధ్యం కాని రికార్డుపై క‌న్నేసిన ద‌క్షిణాఫ్రికా.. గంభీర్ ప‌ని గోవిందా!

ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలుచుకున్న భార‌త మ‌హిళ‌ల క‌బ‌డ్డీ జ‌ట్టు పై ప్ర‌స్తుతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సైతం అభినంద‌లు తెలిపారు.