Yashasvi Jaiswal : ఉస్మాన్ ఖవాజా, జాక్ క్రాలీ రికార్డులు బ్రేక్.. యశస్వి జైస్వాల్ అరుదైన మైలురాయి..
గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) హాఫ్ సెంచరీతో రాణించాడు.
Yashasvi Jaiswal beats Usman Khawaja and Zak Crawley in major WTC milestone
Yashasvi Jaiswal : గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో భారత తొలి ఇన్నింగ్స్‌లో 97 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 58 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు అరుదైన ఘనత అందుకున్నాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27లో అత్యధిక సార్లు 50 ఫ్లస్ పరుగులు సాధించిన ఓపెనర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా, ఇంగ్లాండ్ ఆటగాడు జాక్ క్రాలీని అధిగమించాడు.
ఉస్మాన్ ఖవాజా, జాక్ క్రాలీ లు డబ్ల్యూటీసీలో ఇప్పటి వరకు చెరో 19 సార్లు ఈ ఘనత సాధించారు. తాజాగా దక్షిణాఫ్రికా పై అర్థశతకంతో జైస్వాల్ డబ్ల్యూటీసీలో 20 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
డబ్ల్యూటీసీ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక సార్లు 50+ పరుగులు చేసింది వీరే..
* దిముత్ కరుణరత్నే – 21 సార్లు (64 ఇన్నింగ్స్‌లు)
* యశస్వి జైస్వాల్ – 20 సార్లు (52 ఇన్నింగ్స్‌లు)
* జాక్ క్రాలే – 19 సార్లు (89 ఇన్నింగ్స్‌లు)
* ఉస్మాన్ ఖవాజా – 19 సార్లు (73 ఇన్నింగ్స్‌లు)
* టామ్ లాథమ్ – 18 సార్లు (70 ఇన్నింగ్స్‌లు)
* క్రెయిగ్ బ్రాత్‌వైట్ – 17 సార్లు (82 ఇన్నింగ్స్‌లు)
* బెన్ డకెట్ – 17 సార్లు (57 ఇన్నింగ్స్‌లు)
* రోహిత్ శర్మ – 17 సార్లు (66 ఇన్నింగ్స్‌లు)
