Yashasvi Jaiswal beats Usman Khawaja and Zak Crawley in major WTC milestone
Yashasvi Jaiswal : గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో భారత తొలి ఇన్నింగ్స్‌లో 97 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 58 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు అరుదైన ఘనత అందుకున్నాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27లో అత్యధిక సార్లు 50 ఫ్లస్ పరుగులు సాధించిన ఓపెనర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా, ఇంగ్లాండ్ ఆటగాడు జాక్ క్రాలీని అధిగమించాడు.
ఉస్మాన్ ఖవాజా, జాక్ క్రాలీ లు డబ్ల్యూటీసీలో ఇప్పటి వరకు చెరో 19 సార్లు ఈ ఘనత సాధించారు. తాజాగా దక్షిణాఫ్రికా పై అర్థశతకంతో జైస్వాల్ డబ్ల్యూటీసీలో 20 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
డబ్ల్యూటీసీ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక సార్లు 50+ పరుగులు చేసింది వీరే..
* దిముత్ కరుణరత్నే – 21 సార్లు (64 ఇన్నింగ్స్‌లు)
* యశస్వి జైస్వాల్ – 20 సార్లు (52 ఇన్నింగ్స్‌లు)
* జాక్ క్రాలే – 19 సార్లు (89 ఇన్నింగ్స్‌లు)
* ఉస్మాన్ ఖవాజా – 19 సార్లు (73 ఇన్నింగ్స్‌లు)
* టామ్ లాథమ్ – 18 సార్లు (70 ఇన్నింగ్స్‌లు)
* క్రెయిగ్ బ్రాత్‌వైట్ – 17 సార్లు (82 ఇన్నింగ్స్‌లు)
* బెన్ డకెట్ – 17 సార్లు (57 ఇన్నింగ్స్‌లు)
* రోహిత్ శర్మ – 17 సార్లు (66 ఇన్నింగ్స్‌లు)