Issf
ISSF: ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో భారత్ 5 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్య పతకాలతో సాధించి అగ్రస్థానంలో నిలిచింది. టోర్నమెంట్ చివరి రోజున 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత ప్లేయర్ అనీష్ భన్వాలా, విజయవీర్ సిద్ధూ, సమీర్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మైరాజ్ అహ్మద్ ఖాన్, ముఫద్దల్ దీసవాలా 17 జట్లలో తొమ్మిదో స్థానంలో నిలిచారు.
2019లో జరిగిన ISSF ప్రపంచకప్‌లో మొత్తం ఐదు దశల్లోనూ భారత్ విజయం సాధించింది.
ISSF షూటింగ్ ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన పోటీల్లో యువ షూటర్లు అనీష్ భన్వాలా, రిథమ్ సాంగ్వాన్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. కాంస్య పతక ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత జోడీ 16-12తో చెక్ జోడీ అన్నా డెడోవా, మార్టిన్ పొడ్రాస్కీపై విజయం సాధించింది.
Read Also: పారాలింపిక్స్‌లో షూటర్ అవనీ లేఖారాకు గోల్డ్ మెడల్..
ISSF షూటింగ్ ప్రపంచకప్‌లో అనీష్, రిథమ్‌లకు ఇది రెండో పతకం. 2022 మార్చిలో కైరో వరల్డ్ కప్‌లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఈ జంట గోల్డ్ మెడల్ గెలుచుకుంది.
చాంగ్వాన్ ప్రపంచకప్‌లో భారత్ ప్రస్తుతం ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం 14 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.