IND vs ENG 5th test : ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 ప‌రుగుల తేడాతో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం.. 4-1తో సిరీస్ కైవ‌సం..

ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం సాధించింది.

India won by innings 64 runs in Dharmashala test against england

IND vs ENG : ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం సాధించింది. ఇన్నింగ్స్ 64 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్ర‌మంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ను 4-1తో కైవ‌సం చేసుకుంది. 259 ప‌రుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ 195 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో జోరూట్ (84; 128 బంతుల్లో 12 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. జానీ బెయిర్ స్టో (39; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3సిక్స‌ర్లు), టామ్‌హార్డ్లీ(20) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. జాక్‌క్రాలీ (0), బెన్‌డ‌కెట్ (2), బెన్ స్టోక్స్ (2), బెన్ ఫోక్స్ (8), ఓలీపోప్ (19)లు విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఐదు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాద‌వ్, జ‌స్‌ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ర‌వీంద్ర జ‌డేజా ఓ వికెట్ తీశాడు.

చ‌రిత్ర సృష్టించిన జేమ్స్ అండ‌ర్స‌న్‌.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు

4 ప‌రుగులు 2 రెండు వికెట్లు..

అంత‌క‌ముందు ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 473 ప‌రుగుల‌తో మూడో రోజు మొద‌టి ఇన్నింగ్స్ కొన‌సాగించిన భార‌త్ ఓవ‌ర్ నైట్ స్కోరుకు మ‌రో నాలుగు ప‌రుగులు మాత్ర‌మే జోడించి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. ఓవ‌ర్ నైట్ స్కోరుకు మ‌రో మూడు ప‌రుగులు జోడించిన కుల్దీప్ యాదవ్(30) అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ బెన్‌ఫోక్స్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. టెస్టుల్లో అండ‌ర్స‌న్‌కు ఇది 700వ వికెట్ కావ‌డం విశేషం. సుదీర్ఘ ఫార్మాట్‌లో 700 వికెట్లు తీసి తొలి ఫాస్ట్ బౌల‌ర్‌గా అండ‌ర్స‌న్ చ‌రిత్ర సృష్టించాడు.

కుల్దీప్ యాద‌వ్ ఔటైన త‌రువాతి ఓవ‌ర్‌లోనే ఓవ‌ర్ నైట్ స్కోరు ఒక్క ప‌రుగు జోడించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా (20) షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో 477 ప‌రుగుల వ‌ద్ద భార‌త తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భార‌త్‌కు కీల‌క‌మైన 259 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో షోయ‌బ్ బ‌షీర్ ఐదు వికెట్లు తీశాడు. జేమ్స్ అండ‌ర్స‌న్‌, టామ్‌హార్డ్లీ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. బెన్‌స్టోక్స్ ఓ వికెట్ సాధించాడు. కాగా.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.

Sunil Gavaskar : సర్ఫరాజ్.. ఆ చెత్త షాట్ అవసరమా? సునీల్ గవాస్కర్ కీలక సూచన

మ్యాచ్ స్కోరు వివ‌రాలు..
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌..218 ఆలౌట్‌
భార‌త మొద‌టి ఇన్నింగ్స్ .. 477
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌.. 195

 

 

ట్రెండింగ్ వార్తలు