Indian cricketers complain to BCCI : నిద్ర లేదు మ‌హా ప్ర‌భో.. మ‌రోసారి ఇలా చేయ‌కండి.. బీసీసీఐకి భార‌త క్రికెట‌ర్ల ఫిర్యాదు..!

గురువారం (జూలై 27) నుంచి బార్బ‌డోస్ వేదిక‌గా వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుండ‌గా టీమ్ఇండియా ప్లేయ‌ర్ల‌కు ఓ పెద్ద క‌ష్టం వ‌చ్చి ప‌డింద‌ట‌. దీంతో రాత్రి స‌రైన నిద్ర పోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ట‌.

Indian cricketers complain BCCI

Indian cricketers complain BCCI : టీమ్ఇండియా ప్ర‌స్తుతం వెస్టిండీస్‌లో ప‌ర్య‌టిస్తోంది. వ‌ర్షం కార‌ణంగా రెండో టెస్టు ఆఖ‌రి రోజు మొత్తంగా ర‌ద్దు కావ‌డంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. భార‌త్ 1-0 తేడాతో టెస్టు సిరీస్‌ను సాధించింది. ఇక ఇప్పుడు వ‌న్డే సిరీస్‌పై భార‌త్ దృష్టి సారించింది. గురువారం (జూలై 27) నుంచి బార్బ‌డోస్ వేదిక‌గా వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుండ‌గా టీమ్ఇండియా ప్లేయ‌ర్ల‌కు ఓ పెద్ద క‌ష్టం వ‌చ్చి ప‌డింద‌ట‌. దీంతో రాత్రి స‌రైన నిద్ర పోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ట‌.

విండీస్‌తో తొలి వ‌న్డే ఆడేందుకు ఆట‌గాళ్లు టెస్టు మ్యాచ్ ముగిసిన త‌రువాత ట్రినిడాడ్ నుంచి బార్బ‌డోస్‌కు టీమ్ఇండియా ఆట‌గాళ్లు విమానాశ్ర‌యానికి సోమ‌వారం రాత్రి చేరుకున్నారు. రాత్రి 11 గంట‌ల‌కు రావాల్సిన విమానం దాదాపు నాలుగు గంట‌ల ఆల‌స్యంగా తెల్ల‌వారుజామున 3 గంట‌లకు వ‌చ్చిందట‌. దీంతో ఆట‌గాళ్ల అస‌హ‌నానికి గురైయ్యార‌ని, స‌రైన నిద్ర లేక ఇబ్బందులు ప‌డిన‌ట్లు తెలుస్తోంది. టెస్టు సిరీస్‌, వ‌న్డే సిరీస్‌కు మ‌ధ్య ఎక్కువ స‌మ‌యం లేక‌పోవ‌డంతో ఇది కాస్త ఇబ్బందిగా మారింద‌ట‌.

MS Dhoni Driving Luxury Car : పాత‌కాలం నాటి ల‌గ్జ‌రీ కారులో ధోని చ‌క్క‌ర్లు.. ప‌క్క‌న ఎవ‌రు కూర్చున్నారో తెలుసా..?

ఈ విష‌య‌మై బీసీసీఐకి జ‌ట్టు మేనేజ్‌మెంట్ లేఖ రాసింది. సోమ‌వారం టెస్టు సిరీస్ ముగియ‌గా గురువారం తొలి వ‌న్డే ఆడాల్సి ఉంది. ఈ ప్ర‌యాణం వ‌ల్ల ఒక రోజంతా ఆట‌గాళ్లకు నిద్ర లేదు. దీంతో శిక్ష‌ణ‌కు ఇబ్బంది ఏర్ప‌డింది. ఇక పై రాత్రి ప్ర‌యాణాలు ఉండ‌కుండా చూడాల‌ని, కేవ‌లం ప‌గ‌టి పూట మాత్ర‌మే ఉండే బెట‌ర్ అంటూ లేఖ రాసింది.

టీమ్ఇండియా ఆట‌గాళ్లు హోటల్ నుంచి రాత్రి 8.40 గంట‌లకు విమానాశ్ర‌యానికి బ‌య‌లుదేరారు. కాగా.. ఎయిర్‌పోర్టులో చాలా చేసే విమానం కోసం వేచి ఉండాల్సి వ‌చ్చింది. ఇలా లేట్ నైట్ ప్రయాణాలు కాకుండా ఉద‌యం పూట ప్ర‌యాణించేలా విమానాలు బుక్ చేయాల‌ని టీమ్ మేనేజ్‌మెంట్ బీసీసీఐని కోరింది. ఇలా చేస్తే ఆట‌గాళ్ల‌కు నిద్ర స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని, మ్యాచ్ త‌రువాత కూడా విశ్రాంతి తీసుకునేందుకు కాస్త స‌మ‌యం ఆట‌గాళ్ల‌కు దొరుకుతుంద‌ని చెప్పింది. ఇందుకు బీసీసీఐ కూడా అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఇక‌పై అలాగే ప్లాన్ చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ట‌.

Toby Roland Jones : ఎంత దుర‌దృష్ట‌మో.. బంతి ఏమో సిక్స‌ర్‌గా వెళ్లింది.. కానీ బ్యాట‌ర్‌ ఔట్.. ఒక్క ప‌రుగు రాలే

వ‌న్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..

మొద‌టి వ‌న్డే – జూలై 27 – కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
రెండ‌వ వ‌న్డే – జూలై 29 – కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
మూడ‌వ వ‌న్డే – ఆగస్ట్ 1 – క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్

ట్రెండింగ్ వార్తలు