MS Dhoni Driving Luxury Car : పాత‌కాలం నాటి ల‌గ్జ‌రీ కారులో ధోని చ‌క్క‌ర్లు.. ప‌క్క‌న ఎవ‌రు కూర్చున్నారో తెలుసా..?

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని (Dhoni) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన మ‌హేంద్రుడు ప్ర‌స్తుతం కుటుంబంతో క‌లిసి రాంచీలోని త‌న ఫామ్ హౌస్‌లో ఆనందంగా గ‌డుపుతున్నాడు.

MS Dhoni Driving Luxury Car : పాత‌కాలం నాటి ల‌గ్జ‌రీ కారులో ధోని చ‌క్క‌ర్లు.. ప‌క్క‌న ఎవ‌రు కూర్చున్నారో తెలుసా..?

MS Dhoni Driving Car

Updated On : July 26, 2023 / 4:51 PM IST

MS Dhoni Driving Car : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని (Dhoni) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన మ‌హేంద్రుడు ప్ర‌స్తుతం కుటుంబంతో క‌లిసి రాంచీలోని త‌న ఫామ్ హౌస్‌లో ఆనందంగా గ‌డుపుతున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) త‌రుపున ఆడుతున్నాడు. ఇక ధోనికి కార్లు, బైకులు అంటే ఎంత ఇష్ట‌మో అంద‌రికి తెలిసిందే.

వాహ‌నం ఏదైనా స‌రే.. వింటేజ్ నుంచి కొత్త మోడ‌ల్ వ‌ర‌కు అత‌డికి నచ్చితే చాలు వెంట‌నే అది త‌న‌ గ్యారేజీలో ఉండాల్సిందే. అత‌డి గ్యారేజీలో ఎన్నో లగ్జరీ వింటేజ్‌ కార్లు, బైక్‌లు ఉన్నాయి. కాగా.. ధోని కారు, బైక్ క‌లెక్ష‌న్‌కు సంబంధించిన వీడియోను మాజీ క్రికెట‌ర్ వెంక‌టేశ్ ప్ర‌సాద్ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Toby Roland Jones : ఎంత దుర‌దృష్ట‌మో.. బంతి ఏమో సిక్స‌ర్‌గా వెళ్లింది.. కానీ బ్యాట‌ర్‌ ఔట్.. ఒక్క ప‌రుగు రాలే

ఇక‌.. మ‌హేంద్రుడు విరామం దొరికిన స‌మ‌యాల్లో త‌న గ్యారేజీలో ఉన్న వాటిలోంచి త‌న‌కు న‌చ్చిన కారు లేదా బైక్‌పై రాంచీ వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతుంటాడు. తాజాగా వింటేజ్ మోడ‌ల్ కారులో ధోని ప్ర‌యాణించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 1980 నాటి మోడ‌ల్ బ్లూ క‌ల‌ర్ రోల్స్ రాయిస్ కారులో మ‌హేంద్రుడు ప్ర‌యాణిస్తుండ‌గా బైక్ పై వెలుతున్న ఓ వ్య‌క్తి వీడియో తీసి దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇటీవ‌లే మోకాలికి స‌ర్జ‌రీ చేయించుకున్న ధోని స్వ‌యంగా కారు న‌డుపుతుండ‌గా ప‌క్క సీటులో కూతురు జీవా ఉండ‌డాన్ని చూడొచ్చు.

Harmanpreet Kaur Controversy : మరీ ఓవర్‌గా అనిపించింది.. ఇది చాలదు.. 100 శాతం.. భార‌త్ విష‌యంలోనే కాదు..

ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 90 ద‌శకంలోని పాట‌లు, ధోని రైడ్ రెండూ అదుర్స్ అంతే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by subodh singh Kushwaha (@kushmahi7)

Asian Games 2023 : అమ్మ ప్రేమ‌.. పిల్ల‌ల‌ను తీసుకురావొద్ద‌న్నందుకు.. ఆసియా గేమ్స్ నుంచి త‌ప్పుకున్న క్రికెట‌ర్‌