IPL 2021 : కరోనా నీడలో ఐపీఎల్ 14వ సీజన్..ప్రేక్షకులకు నో ఎంట్రీ

Indian Premier League : కరోనా నీడలో క్రికెట్‌ పండుగ స్టార్ట్‌ అవ్వనుంది. బయో సెక్యూర్‌ వాతావరణంలో ఐపీఎల్‌ 14వ సీజన్‌కు 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం తెరలేవనుంది. మహమ్మారి కారణంగా అట్టహాసమైన ఆరంభోత్సవాలకు దూరంగా.. ప్రేక్షకులను అనుమతించకుండా.. ఖాళీ మైదానాల్లోనే సీజన్‌ మొదలవనుంది. లీగ్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా ఐదు సార్లు టైటిల్‌ చేజిక్కించుకున్న ముంబై ఇండియన్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై అన్నిరంగాల్లో పటిష్టంగా ఉంటే.. మ్యాక్స్‌వెల్‌ రాకతోనైనా రాత మారుతుందా అని బెంగళూరు ఎదురుచూస్తోంది.

రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌, కృనాల్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌ లాంటి హిట్టర్లున్న ముంబై బ్యాటింగ్‌ ఆర్డర్‌ను.. సిరాజ్‌, సుందర్‌, చాహల్‌తో కూడిన బెంగళూరు బౌలింగ్‌ ఎలా అడ్డుకుంటుందోనన్నదానిపై ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అటు విరాట్‌ కోహ్లీ, దేవదత్‌ పడిక్కల్‌, డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌తో ఆర్‌సీబీ టీమంతా మ్యాచ్‌ విన్నర్లే ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌పై బెంగళూరు చాలా ఆశలు పెట్టుకుంది.

Read More : Osmania University: ఓయూ రీసెర్చ్.. 500గ్రాముల బ్యాటరీతో ఆర్టిఫిషియల్ హార్ట్

ట్రెండింగ్ వార్తలు