తొలి ఇన్నింగ్స్ కు టీమిండియా డిక్లేర్ ఇచ్చేసింది. మూడో రోజు ఆటను ఓవర్ నైట్ స్కోరు 413పరుగులతో ఆరంభించిన కోహ్లీసేన కాసేపటికే డిక్లేర్ పలికింది. శనివారం ఆటలోనూ అదే దూకుడును ప్రదర్శించి 493పరుగులకు చేరింది. స్ట్రైకింగ్ లో ఉన్న ఉమేశ్ యాదవ్(25; 10బంతుల్లో 1ఫోర్, 3సిక్సులు)తో అదరగొట్టాడు. మరో ఎండ్ లో రవీంద్ర జడేజా(60)లతో కలిసి నాటౌట్ గా నిలిచారు.
మొదటి రోజు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 150పరుగులు చేసి ఆలౌట్ అవగా టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి 343పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి రోజు 86/1తో ముగించిన టీమిండియా స్కోరును మయాంక్ డబుల్ సెంచరీతో పరుగులు పెట్టించాడు. రెండో రోజు ఆటలో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. సమయోచితంగా ఆడుతూ అడపదడపా బౌండరీలతో భారీ స్కోరు చేశారు. ఈ క్రమంలోనే పూజారా, రహానె, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీకి మించిన వ్యక్తిగత స్కోరు నమోదు చేయగలిగారు.
రెండో రోజు ఆటలో కోహ్లీసేన ఆరంభంలోనే రెండు వికెట్లు పోగొట్టుకుంది. పూజారా(54) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అబు జాయేద్ బౌలింగ్ లో సైఫ్ హస్సన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్దిపాటి విరామం తర్వాత బరిలోకి దిగిన కోహ్లీ (ఎల్బీడబ్ల్యూ) డకౌట్ గా నిరాశపరిచాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అజింకా రహానె(86), వృద్ధిమాన్ సాహా(12), ఉమేశ్ యాదవ్(25) చక్కటి ఇన్నింగ్స్ కనబరిచారు. బంగ్లా బౌలర్లలో అబూ జాయేద్ 4వికెట్లు పడగొట్టగా, ఇబాదత్ హుస్సేన్, మెహిదీ హసన్ చెరో వికెట్ చేజిక్కించుకున్నారు.
Our pacers strike early on, on Day 3 of the 2nd Test. Both Bangladesh openers are back in the hut.#TeamIndia need 8 more wickets to win the 1st Test.
Live – https://t.co/kywRjNI5G1 #INDvBAN pic.twitter.com/1tVwPAYKrc
— BCCI (@BCCI) November 16, 2019