INDvsENG : వైభ‌వ్ సూర్య‌వంశీకి మ‌రోసారి నిరాశే.. తొలి టీ20లో టాస్ గెలిచిన భార‌త్..

భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య (INDvsENG) 5 మ్యాచ్ టీ20 సిరీస్ ప్రారంభమైంది

INDvsENG 1st T20 team india won the toss elected bat no Vaibhav Sooryavanshi

INDvsENG : భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య 5 మ్యాచ్ టీ20 సిరీస్ ప్రారంభమైంది. చెస్టర్-లె-స్ట్రీట్ లోని రివర్‌సైడ్ గ్రౌండ్ వేదిక‌గా తొలి టీ20 మ్యాచ్ జ‌రుగుతోంది. టాస్ గెలిచిన భార‌త జ‌ట్టు కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 15 ఏళ్ల యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీకి తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌లేదు. దీంతో అత‌డు అరంగ్రేటానికి మ‌రికొంత స‌మ‌యం వేచి చూడ‌క త‌ప్ప‌దు.

‘మేము తొలుత బ్యాటింగ్ చేస్తాం. ఐర్లాండ్ సిరీస్ ఓ గ‌తం. ఇంగ్లాండ్ సిరీస్ మాకు గొప్ప అవ‌కాశం. నిజానికి కెప్టెన్‌గా ఇది నా రెండవ సిరీస్. ఈ సిరీస్‌ను విజ‌యంతో ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఉన్నాము. నిన్న ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ కూడా చేశాము, పరిసరాలకు కూడా బాగా అలవాటు పడ్డాము. కాబట్టి.. ఒక ఉత్కంఠభరితమైన సిరీస్ కోసం ఎదురుచూస్తున్నాము. ఐర్లాండ్ సిరీస్ నుండి మేము చాలా నేర్చుకున్నాము. ఇంగ్లాండ్ ఎలా ఆడుతుందో మాకు తెలుసు. వారి బలాలు, బలహీనతలు అవ‌గాహ‌న ఉంది. ఇది మంచి వికెట్. పిచ్ పై గ‌డ్డి ఉంది. కాబట్టి.. వికెట్ ఎలా ఆడుతుందో నిజానికి అంచనా వేయలేము, మేము ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాము.’ అని శ్రేయ‌స్ అయ్య‌ర్ తెలిపాడు.

ఇంగ్లాండ్ తుది జ‌ట్టు..
ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), హ్యారీ బ్రూక్(కెప్టెన్‌), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.

భారత తుది జ‌ట్టు..
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్( కెప్టెన్‌), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి.