Varanasi : రూ.451 కోట్లతో వరణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం…రేపు మోదీ శంకుస్థాపన

Varanasi Cricket Stadium

Varanasi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత నియోజకవర్గమైన వరణాసిలో 330కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వరణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 23వతేదీన శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ క్రికెట్ నిర్మాణానికి భూసేకరణ కోసం రూ.121 కోట్లు వెచ్చించింది. (International Cricket Stadium In Varanasi ) వరణాసిలోని స్టేడియం స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ రూ.330 కోట్లు వెచ్చించనుంది. రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తర్వాత, వరణాసిలో నిర్మిస్తున్న ఈ స్టేడియంలో శివుని సంగ్రహావలోకనం, కాశీ యొక్క స్వరూపం కనిపించనుంది.

Chandrababu Custody : నేడే తీర్పు..‍! చంద్రబాబు కస్టడీ పిటిషన్, ఏసీబీ కోర్టు తుది నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ

పూర్వాంచల్ క్రికెట్ అభిమానులు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లను చూడటానికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదని బీసీసీఐ పేర్కొంది. రూ.451 కోట్లతో ఈ స్టేడియం నిర్మిస్తున్నారు. ఈ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా కల్పించనున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. వరణాసిలోని రాజతలాబ్ ప్రాంతంలోని గంజరి గ్రామంలోని రింగ్‌రోడ్డుకు సమీపంలో ఈ స్టేడియం 30 నెలల్లో సిద్ధం కానుంది.

Arunkumar Vundavalli : బాంబు పేల్చిన ఉండవల్లి.. చంద్రబాబు కేసుని సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్

30వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న స్టేడియంలో 7 పిచ్‌లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిబంధనల ప్రకారం అత్యాధునిక స్టేడియం నిర్మించనున్నారు. 2025 డిసెంబర్ నాటికి ఈ స్టేడియం పూర్తి కానుంది. శివుడికి సంబంధించిన సంగీత వాయిద్యం ఆకారంతోపాటు గంగా ఘాట్ మెట్లను పోలిన ప్రేక్షకుల గ్యాలరీ ఉంటుంది. శంకుస్థాపన కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కర్ వంటి ప్రముఖ క్రికెటర్లు పాల్గొనే అవకాశం ఉంది. రేపు జరగనున్న వరణాసి స్టేడియం శంకుస్థాపన కార్యక్రమానికి బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ జే షా సహా కీలక వ్యక్తులు కూడా హాజరుకానున్నారు. కాన్పూర్, లక్నో తర్వాత ఉత్తరప్రదేశ్‌లో మూడవ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని వరణాసిలో నిర్మిస్తున్నారు.