వరల్డ్ కప్ ఎఫెక్ట్: ఐపీఎల్ 12ను వదిలేయనున్న విదేశీయులు వీరే

వరల్డ్ కప్ ఎఫెక్ట్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌పై పెను ప్రభావమే చూపిస్తుంది. స్టార్ ప్లేయర్లు అయిన విదేశీ ప్లేయర్లు వరల్డ్ కప్ ప్రాక్టీస్ క్యాంప్ పిలుపు మేర లీగ్‌ను వీడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్-బితో సిద్ధమైపోయాయి. వరల్డ్ కప్‌ కోసం ఆయా జట్లు మే 23నాటికల్లా పర్‌ఫెక్ట్ టీంతో సిద్ధం కావాలని ముందుగానే ప్రిపరేషన్ మొదలుపెట్టనున్నాయి. 

ఎవరైతే పేలవ ప్రదర్శన చేస్తున్నారో.. వారిని తప్పించి ఐసీసీ ప్రమేయం లేకుండానే చక్కటి ప్లేయర్లతో జట్టు తయారు చేసుకోవాలనే ప్రణాళికలతో ఉన్నాయి క్రికెట్ బోర్డులు. వరల్డ్ కప్ ప్రాక్టీస్ క్యాంప్ కోసం ఇంకా విండీస్‌, న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌‌లు ప్రకటించలేదు. ఇప్పటికి ప్రకటించిన జట్లను బట్టి బెంగళూరు, హైదరాబాద్‌, రాజస్థాన్‌ జట్ల నుంచి ఎక్కువ మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ను వీడి వెళ్లనున్నారు. జట్ల వారీగా వారి వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌ స్టో – సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌ 
మొయిన్‌ అలీ, స్టోనిస్‌, క్లసీన్‌, డేల్‌ స్టెయిన్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 
కగిసో రబాడ – ఢిల్లీ క్యాపిటల్స్‌ 
జోస్ బట్లర్‌, స్టీవ్‌ స్మిత్‌, బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌ – రాజస్థాన్‌ రాయల్స్‌ 
ఫాఫ్‌ డుప్లెసిస్‌, ఇమ్రాన్‌ తాహీర్‌ – చెన్నై సూపర్‌ కింగ్స్‌ 
బహ్రెండార్ఫ్‌, డికాక్‌ – ముంబై ఇండియన్స్‌ 
డేవిడ్‌ మిల్లర్‌ – కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 
జో డెన్లీ – కోల్‌కతా నైట్‌రైడర్స్‌