ఐపీఎల్ వేలం 2020: కోల్‌కతాలో నేడే.. హాట్ ఫేవరెట్లు ఎవరంటే?

  • Publish Date - December 19, 2019 / 02:02 AM IST

కోల్‌కతాలో ఇవాళ(గురువారం) ఐపీఎల్ వేలం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అన్ని ఫ్రాంచైజీల యాజమాన్యాలు పలువురు ఆటగాళ్లపై దృష్టి పెట్టాయి. ఐపీఎల్‌లో 2020 వేలంలో అంతర్జాతీయ స్టార్ల నుంచి దేశవాళీ క్రికెటర్ల వరకు చాలా మంది అమ్మకానికి ఉన్నారు. ఐపీఎల్ వేలం తొలిసారి కోల్‌కతాలో జరగనుంది. మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు మొదలవుతుంది.

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ప్యాట్‌ కమిన్స్‌, క్రిస్‌ లిన్‌, మోర్గాన్‌, క్రిస్‌ మోరిస్‌, షిమ్రోన్‌ హెట్‌మయర్‌లు ఈ వేలంలో స్టార్లుగా ఉన్నారు. వీరంతా వేలంలో భారీ రేటు పలకనున్నట్లు తెలుస్తుంది. భారత్‌ నుంచి రాబిన్‌ ఉతప్ప, ఉనద్కత్‌ల కోసం మంచి పోటీ ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక భారత్ నుంచి కుర్రాళ్ల హవా ఎక్కువగా ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఇక అన్నీ జట్ల కంటే అత్యధికంగా బెంగళూరుకు 12 మందిని తీసుకునే అవకాశం ఉంది. వాళ్ల దగ్గర ఉన్న డబ్బు మాత్రం రూ.27.90 కోట్లు మాత్రమే. ఓ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండొచ్చు. ఎనిమిది ఫ్రాంఛైజీలకు కలిపి అందుబాటులో ఉన్న ఖాళీ స్థానాలు. గరిష్టంగా 73 మంది. ఇందులో విదేశీ క్రికెటర్ల సంఖ్య 29కి దాటకూడదు. వేలంలో 13 మంది భారతీయులతో సహా 134 మంది అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన వాళ్లు ఉన్నారు. 198 మంది అసలు అరంగేట్రం చేయనివాళ్లు ఉన్నారు.

ఇక ఈ వేలంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ ఫ్రాంఛైజీ దగ్గర ఎక్కువగా డబ్బులు ఉన్నాయి. ఆ ప్రాంచైజి దగ్గర రూ. 42.70కోట్లు ఉన్నాయి. వేలం లైవ్ టెలికాస్ట్ స్టార్ స్పోర్ట్స్‌లో కానుంది.